Aadhar Update Alert | ఆధార్ కార్డ్ (Aadhar Card) అప్ డేట్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో UIDAI కీలక నిర్ణయం తీసుకుంది.
ఆధార్ ఉచిత అప్డేట్ గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. 6 నెలల వరకు గడువును పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. దీంతో ఆరు నెలల వరకు ఆధార్ వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.
2025 జూన్ 14 వరకు ఈ ఫ్రీ ఆధార్ అప్ డేట్ గడువును పొడిగిస్తున్నట్లు ఉడాయ్ వెల్లడించింది. దీంతో ఆధార్ కార్డులో అడ్రస్ వివరాలు మార్చులు చేయాలనుకున వారు ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకు ఒకసారి కచ్చితంగా ఆధార్ సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ వివరాల్లో మార్పులకు ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది.