Thursday 8th October 2026
12:07:03 PM
Home > తాజా > సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 25 చోరీ ఫోన్ల రికవరీ!

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 25 చోరీ ఫోన్ల రికవరీ!

  • మీర్‌చౌక్ పోలీసుల సమర్థవంతమైన చర్యలు
  • బాధితులకు అందజేత!

Mirchowk Police Mobile Recovery హైదరాబాద్‌లోని చార్మినార్ జోన్ పరిధిలో ఉన్న మీర్‌చౌక్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌ను సమర్థవంతంగా ఉపయోగించి రికవరీ చేసిన 25 పోయిన/చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గురువారం బాధితులకు తిరిగి అందజేశారు. మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మీర్‌చౌక్ డివిజన్ ఏసీపీ శ్రీ జి. శ్యామ్ సుందర్ గారు ఈ ఫోన్లను బాధితులకు అందజేసి వారి ముఖాల్లో సంతోషాన్ని నింపారు.

సీఈఐఆర్ (CEIR) ద్వారా ట్రేసింగ్..

వివిధ సందర్భాల్లో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదుల ఆధారంగా మీర్‌చౌక్ క్రైమ్ టీమ్ కేసు నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో నిరంతర సాంకేతిక విశ్లేషణ, ట్రాకింగ్ ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 25 ఫోన్ల లొకేషన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లు పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైనా ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని లేదా CEIR పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా వివరాలు నమోదు చేయాలని సూచించారు. దీనివల్ల ఫోన్ ట్రేసింగ్ సులభమై త్వరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుందన్నారు.

పోలీస్ బృందానికి అభినందనలు..

మీర్‌చౌక్ ఇన్స్‌పెక్టర్ ఎం. కొండల్ రావు, డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ ఎన్. సైదయ్య గార్ల మార్గదర్శకత్వంలో డిఎస్సై ఎం.డి. ముజ్తబా అలీ కాసిమ్ మరియు క్రైమ్ డిటెక్టివ్ బృందం శ్రమించి ఈ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన అధికారులను, క్రైమ్ సిబ్బందిని ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions