Wednesday 30th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పేదలకు పట్టాభిషేకం’: 120 ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం..!

పేదలకు పట్టాభిషేకం’: 120 ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం..!

  • రూ.52,000 కోట్ల విలువైన పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు!

CM Chandrababu House Pattas Vijayawada విజయవాడలోని మకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

తమ ప్రభుత్వం 120 ఏళ్ల నాటి ఇళ్ల స్థలాల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిందని ఆయన ప్రకటించారు. సొంత ఇల్లు అనేది పేదల జీవితకాల స్వప్నమని, దీని కోసం 40 నుంచి 50 ఏళ్లుగా ఎందరో ఎదురుచూస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

విజయవాడలోని మకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

తమ ప్రభుత్వం 120 ఏళ్ల నాటి ఇళ్ల స్థలాల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిందని ఆయన ప్రకటించారు. సొంత ఇల్లు అనేది పేదల జీవితకాల స్వప్నమని, దీని కోసం 40 నుంచి 50 ఏళ్లుగా ఎందరో ఎదురుచూస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

26,401 మందికి ఇళ్ల పట్టాలు..

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 26,401 మంది అర్హులైన లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో సగటున ఒక్కో లబ్ధిదారునికి 130 గజాల స్థలానికి పట్టాలు ఇచ్చారు.విశాఖ, మంగళగిరి, విజయవాడ కార్యక్రమాలతో కలిపి ఇప్పటివరకు సుమారు 60,000 పట్టాలు పంపిణీ చేశామని, వాటి విలువ రూ.52,000 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ ఆస్తిని అమ్ముకోవద్దని, కాపాడుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.

డబుల్ ఇంజన్ సర్కార్ తోనే..

కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం జెట్ స్పీడ్‌తో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. ఇచ్చే ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

‘స్త్రీ శక్తి’ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో కొత్త ఏసీ బస్సులను కొనుగోలు చేసి వాటిలోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం ప్రకటించారు.

You may also like
doctor saves boy
ఆరేళ్ళ బాలుడికి కరెంట్ షాక్.. సీపీఆర్ చేసిన బతికించిన డాక్టరమ్మ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions