Thursday 25th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఒక్కరోజులోనే రూ. 138 కోట్ల కలెక్షన్.. వ్యాపారంలోనూ కోహ్లీ రికార్డ్!

ఒక్కరోజులోనే రూ. 138 కోట్ల కలెక్షన్.. వ్యాపారంలోనూ కోహ్లీ రికార్డ్!

Virat Kohli One8 Shoes Record Sales | క్రికెట్ పిచ్‌పై సెంచరీలతో రికార్డులు సృష్టించే టీమిండియా రన్ మెషీన్, కింగ్ విరాట్ కోహ్లీ.. ఇప్పుడు వ్యాపార సామ్రాజ్యంలోనూ సరికొత్త చరిత్ర సృష్టించారు.

ఆయనకు చెందిన గ్లోబల్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ‘వన్‌8’ (One8) సరికొత్త షూస్ కలెక్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేయగా, ఊహించని స్థాయిలో అమ్మకాల సునామీ నమోదైంది.

ఈ సరికొత్త బ్రాండ్ లాంచ్ అయిన కేవలం 24 గంటల్లోనే రికార్డు స్థాయి అమ్మకాలతో మార్కెట్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది.

రూ. 138 కోట్ల ఆదాయం..

విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూకు అద్దం పడుతూ కేవలం ఒక్కరోజులోనే కంపెనీ భారీ ఆదాయాన్ని ఆర్జించింది. బ్రాండ్ మార్కెట్లోకి వచ్చిన మొదటి 24 గంటల్లోనే ఏకంగా 1.5 లక్షల జతల షూస్ అమ్ముడయ్యాయి.

ఈ భారీ అమ్మకాల ద్వారా కేవలం ఒక్కరోజులోనే రూ. 138 కోట్లకు పైగా భారీ రెవెన్యూ సమకూరినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

టెస్ట్ రికార్డుతో ప్రైస్ ట్యాగ్..

విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో సాధించిన 9,230 పరుగులకు గుర్తుగా, ఈ ప్రత్యేక ఎడిషన్ షూస్ ధరను కూడా సరిగ్గా రూ. 9,230 గా నిర్ణయించడం విశేషం. ఈ షూస్ లాంచ్ కార్యక్రమానికి సంబంధించిన ఆవిష్కరణ ఈవెంట్‌కు నిర్వాహకులు ఉచిత ప్రవేశాన్ని కల్పించలేదు.

వేల రూపాయలు వెచ్చించి ఈ సరికొత్త షూస్‌ను ముందస్తుగా బుక్ (Pre-book) చేసుకున్న అభిమానులకు మాత్రమే ఈ ప్రత్యేక ఈవెంట్‌లో పాల్గొనే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. అయినప్పటికీ, కోహ్లీని చూసేందుకు, ఈ షూస్ సొంతం చేసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.

మైదానంలోనే కాకుండా గ్లోబల్ బిజినెస్ మార్కెట్‌లోనూ కోహ్లీ బ్రాండ్ పవర్ ఏ స్థాయిలో ఉందో ఈ విక్రయాలు నిరూపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions