Thursday 28th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కర్ణాటక పాలిటిక్స్‌ లో బిగ్ ట్విస్ట్.. సీఎం సిద్ధరామయ్య రాజీనామా!

కర్ణాటక పాలిటిక్స్‌ లో బిగ్ ట్విస్ట్.. సీఎం సిద్ధరామయ్య రాజీనామా!

Siddaramaiah Resignation | కర్ణాటక రాజకీయాల్లో గురువారం అత్యంత కీలకమైన మరియు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య అధికారికంగా ప్రకటించారు.

తన రాజీనామా పత్రాన్ని సమర్పించేందుకు వీలుగా గురువారం మధ్యాహ్నం ఆయన గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు.

ఈ పరిణామాల మధ్యే.. సీఎం సిద్ధరామయ్య పాదాలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నమస్కరించిన విజువల్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా విపరీతమైన పొలిటికల్ టాపిక్‌గా మారాయి.

క్యాబినెట్ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో సంచలన నిర్ణయం: గురువారం ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన అధికారిక నివాసంలో క్యాబినెట్ మంత్రులతో అత్యవసర ‘బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్’ (ఉపాహార సమావేశం) నిర్వహించారు.

ఈ సమావేశంలోనే ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని సహచర మంత్రులకు వివరించి షాక్‌కు గురిచేశారు.

అధిష్టానానికే తుది నిర్ణయం..
తన రాజీనామా అనంతరం కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ హైకమాండ్ (అధిష్టానం) నిర్ణయిస్తుందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. భావోద్వేగ క్షణాలు – కాళ్లు మొక్కిన డీకే: సిద్ధరామయ్య తన నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే, డెప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

ఆయన వెంటనే లేచి వెళ్లి సీఎం సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఇరువురు నేతలు ఒకరినొకరు ఆలింగనం (హగ్) చేసుకున్నారు. ఈ విజువల్స్ కాంగ్రెస్ శ్రేణుల్లో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

తదుపరి సీఎం రేసులో డీకే శివకుమార్..
రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

గత కొంతకాలంగా ఇద్దరు నేతల మధ్య ఉన్న పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగానే ఈ మార్పు జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions