Thursday 30th April 2026
12:07:03 PM
Home > క్రైమ్ > “ప్రభుత్వానిది పెద్ద తప్పు.. బంగ్లా క్రికెట్‌కు తీరని లోటు”

“ప్రభుత్వానిది పెద్ద తప్పు.. బంగ్లా క్రికెట్‌కు తీరని లోటు”

shakib ul hassan

– టీ-20 వరల్డ్ కప్ బహిష్కరణపై షకీబ్ ఘాటు వ్యాఖ్యలు!

Shakib Al Hasan on Bangladesh T20 WC 2026 Withdrawal | 2026 టీ-20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనకపోవడంపై ఆ దేశ దిగ్గజ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఈ నిర్ణయాన్ని అప్పటి ప్రభుత్వం చేసిన ఒక “పెద్ద పొరపాటు” (Blunder) గా ఆయన అభివర్ణించారు.

బుధవారం ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న షకీబ్, ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

షకీబ్ ఏమన్నారంటే…?

“వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ లేకపోవడం దేశ క్రికెట్ అభిమానులకు పెద్ద దెబ్బ. ఇది పూర్తిగా నాటి తాత్కాలిక ప్రభుత్వం మరియు బోర్డు (BCB) తీసుకున్న తప్పుడు నిర్ణయం. ప్రభుత్వ వైఖరి వల్ల ఆటగాళ్లు తీవ్రంగా నష్టపోయారు” అని షకీబ్ విమర్శించారు.

బీసీసీఐతో ఏవైనా విభేదాలు ఉంటే కూర్చుని చర్చించుకోవాలి కానీ, ఐసీసీతో సంబంధాలను దెబ్బతీసుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు.

భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగుపడతాయని, భవిష్యత్తులో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లు ఇరు దేశాల మధ్య దూరాన్ని తగ్గిస్తాయని షకీబ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లకు భద్రత లేదనే సాకుతో, అప్పటి తాత్కాలిక ప్రభుత్వం టీ-20 వరల్డ్ కప్ నుండి వైదొలగాలని నిర్ణయించింది. ఐపీఎల్ నుండి ముస్తఫిజుర్ రెహమాన్ తప్పుకోవడం వంటి పరిణామాలు కూడా ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. దీంతో ఐసీసీ, బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును టోర్నీకి ఎంపిక చేసింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions