Huge Fine For Calling Aunty | పని ప్రదేశంలో తోటి ఉద్యోగిని పదేపదే ‘ఆంటీ’ అని పిలవడం గౌరవం కాదు, అది ‘వేధింపు’ (Harassment) అని బ్రిటన్ ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్ కీలక తీర్పు ఇచ్చింది.
ఒక భారత సంతతి మహిళా ఉద్యోగిని వేధించినందుకు గానూ పశ్చిమ లండన్ ఎన్.హెచ్.ఎస్. (NHS) ట్రస్ట్‌కు సుమారు 1,425 పౌండ్లు (దాదాపు రూ. 1.77 లక్షలు) జరిమానా విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కేసు వివరాలివే..
ఏళ్ల భారత సంతతికి చెందిన ఐల్డా ఎస్తేవ్స్, వాట్‌ఫోర్డ్ లోని వెస్ట్ లండన్ ఎన్.హెచ్.ఎస్. ట్రస్ట్ లో హెల్త్ కేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
అదే వార్డులో పని చేసే నర్స్ చార్లెస్ ఒప్పొంగ్ అనే వ్యక్తి ఆమెను పదేపదే ‘ఆంటీ’ అని పిలిచేవాడు. తనను పేరుతోనే పిలవాలని ఐల్డా ఎస్తేవ్స్ కోరినప్పటికీ, ఒప్పొంగ్ తన తీరు మార్చుకోలేదు. ఆఫీసులో, కారిడార్‌లో అందరి ముందూ ఆమెను ‘ఆంటీ’ అని పిలిచేవాడు.
కేవలం ఆంటీ అని పిలవడమే కాకుండా.. వార్డులో పని చేసే మరో వృద్ధుడితో “నువ్వు ఆ ముసలాయనకి కరెక్ట్ మ్యాచ్” అంటూ రెండుసార్లు వెటకారంగా వ్యాఖ్యానించాడు.
ఈ కేసును విచారించిన జడ్జి జార్జ్ అల్లియట్ ధర్మాసనం మాట్లాడుతూ చార్లెస్ ఒప్పొంగ్ ఘనా (Ghana) దేశానికి చెందిన వ్యక్తి. వారి సంస్కృతిలో పెద్దలను ‘ఆంటీ’ అని పిలవడం గౌరవం.
అయితే, అవతలి వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు కూడా అదే పేరుతో పిలవడం ఆ వ్యక్తిని అగౌరవపరచడమే అవుతుందని కోర్టు స్పష్టం చేసింది.
పదేపదే ఇలా పిలవడం వల్ల పని ప్రదేశంలో ఆమెకు మనోవేదన కలిగిందని, ఇది వయస్సు మరియు లింగం ఆధారంగా చేసిన వేధింపు అని కోర్టు నిర్ధారించింది.
కార్యాలయంలో ఒకరిని ఎలా పిలవాలనేది ఆ వ్యక్తి అభీష్టం అని, కావాలని ‘హ్యూమర్’ పేరుతో ఇబ్బంది పెట్టడం నేరమని తీర్పునిచ్చింది.






