Monday 23rd March 2026
12:07:03 PM
Home > తాజా > ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా!

ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా!

ou

Job Mela in OU |  నిరుద్యోగ యువతకు ఉస్మానియా యూనివర్సిటీ (OU) ఎంప్లాయిమెంట్ బ్యూరో ఒక శుభవార్త అందించింది.

‘భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఫాబ్ సిటీ, రంగారెడ్డి)’ సహకారంతో ఈ నెల 28న ఓయూ క్యాంపస్‌లో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.

మార్చి 28, 2026 (శనివారం), ఉదయం 11:00 గంటలకు ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయం, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా, ఉస్మానియా యూనివర్సిటీలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు.

ఈ జాబ్ మేళా ద్వారా100 అప్రెంటిస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. బిటెక్ (EEE, ECE) లేదా డిప్లోమో (EEE, ECE) ఉత్తీర్ణులైన యువతీ యువకులు అర్హులు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో మార్చి 28న ఉదయం నేరుగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో (UEI&GB/MCC) కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. మరింత సమాచారం కోసం హెచ్.ఆర్ (HR) స్పందన రెడ్డిని 9100877349 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions