Monday 23rd March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > నాకు ఆ వీడియోలతో సంబంధంలేదు: గాయని మంగ్లీ!

నాకు ఆ వీడియోలతో సంబంధంలేదు: గాయని మంగ్లీ!

singer mangli

Singer Mangli | తన పేరు వాడుకుంటూ కొందరు వ్యక్తులు మైక్రోఫైనాన్స్ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే వార్తలపై ప్రముఖ గాయని మంగ్లీ (Singer Mangli) తీవ్రంగా స్పందించారు.

ఈ వ్యవహారంతో తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

“నాకు ప్రొఫెషనల్ సింగింగ్ ఈవెంట్స్, షోలు మినహా ఇతర వ్యాపారాలు ఏమీ లేవు. ముఖ్యంగా మైక్రోఫైనాన్స్ రంగంతో నాకు లేదా నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు” అని మంగ్లీ తేల్చిచెప్పారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరెన్సీ కట్టల వీడియోలకు, తన ఇంటికి ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. కావాలనే తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు ఇదంతా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తనను లేదా తన తమ్ముడిని చాలా మంది కేవలం స్టేజ్ షోలు, ప్రోగ్రామ్ ఆహ్వానాల కోసం సంప్రదిస్తుంటారని, ఆ పరిచయం కేవలం వృత్తిపరమైనది మాత్రమేనని వివరించారు. వారి వ్యక్తిగత వ్యాపారాలు లేదా అక్రమ వసూళ్లతో తమకు ఏమాత్రం సంబంధం లేదని పేర్కొన్నారు.

తన పేరు వాడుకుని అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె పోలీస్ శాఖను కోరారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions