Telangana issues ‘stop use’ notice for Almont-Kid Syrup after CDSCO alert | తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కీలక ఆదేశాలు జారి చేసింది. చిన్నపిల్లలకు ఇచ్చే ‘ఆల్మంట్ కిడ్’ సిరప్ వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రిటైల్ హోలసేల్ మెడికల్ షాపులు, ఆసుపత్రుల్లో ఈ సిరప్ కు సంబంధించి స్టాక్ ఉంటే వాటి విక్రయాన్ని ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సిరప్ లో అత్యంత ప్రమాదకరమైన ‘ఇథలీన్ గ్లైకాల్’ రసాయనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ల్యాబు టెస్టు ద్వారా ఈ కెమికల్ ను గుర్తించినట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
సీడీఎస్సీఓ (CDSCO) సూచనల మేరకు రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్మంట్ కిడ్ సిరప్ ను వాడొద్దని హెచ్చరించింది. బీహార్ లు చెందిన ట్రైడస్ రెమిడీస్ అనే కంపెనీ ఈ ప్రాణాంతక సిరప్ ను తయారు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆల్మంట్ కిడ్ సిరప్, బ్యాచ్ నంబర్ AL-24002 తయారు చేసిన తేదీ జనవరి 2025, ఎక్సపైరీ డేట్ 2026, డిసెంబర్ అని ఉండే సిరప్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.









