Hyd Police High Alert | కొత్త సంవత్సరం వేడుకల వేళ హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) నగరంలో పలు ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పైకి వాహనాలు నిషేధించారు.
నగరంలో బేగంపేట్, టోలీ చౌక్ మినహా అన్ని ఫ్లై ఓవర్లు మూసి వేయనున్నారు. ఫ్లైట్ టికెట్ ఉన్న వారికే పీవీ ఎక్స్ ప్రెస్ వేపైకి అనుమతిస్తారు. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ప్రైవేట్ ట్రావెల్స్ కు నో ఎంట్రీ విధించారు. మందు బాబులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
రాత్రి 7 గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టనున్నారు. మద్యం సేవించి వాహనం నడిపినా, నిర్లక్ష్యంగా, అతివేగంగా డ్రైవ్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సెలబ్రేషన్స్ పేరుతో రోడ్లపైకి వచ్చి కేక్ కట్ చేయడం, బాణాసంచా కాల్చడం, గుంపులుగా చేరి హడావిడి చేయడం వంటివి పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా ఇంటి వద్దే జరుపుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.








