– సినిమాటోగ్రఫీ మంత్రి కీలక ప్రకటన
Avakaya Amaravati Festival | తెలుగు చిత్ర పరిశ్రమ టాలీవుడ్ (Tollywood) కు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ శుభవార్త చెప్పారు.
సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ త్వరలో తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ రేట్లపై ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహిస్తుందని తెలిపారు.
ఏపీలో షూటింగ్ నిర్వహించే సినిమాలకు సంబంధించి టికెట్ రేట్ల పెంపు, అదే విధంగా హై బడ్జెట్ సినిమాలకు రేట్ల పెంపుపై చర్చ ఉంటుందని అన్నారు. అంతేకాకుండా అమరావతిలో ఆవకాయ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రుల అభిమాన వంటకం ఆవకాయ. మన ఆంధ్రప్రదేశ్ లో కళా సంస్కృతి ఎక్కువ. జనవరి 8 నుంచి 10 మధ్య ఆవకాయ- అమరావతి పేరుతో టీం వర్క్ కన్సల్టెంట్స్ తో కలిసి ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
పున్నమి ఘాట్ లో జరిగే ఈ ఫెస్టివల్ లో ఉచిత ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఉగాదికి నంది అవార్డులతోపాటు నంది నాటకోత్సవ అవార్డులు ఇవ్వాలని అనుకుంటున్నామని తెలిపారు.










