Prabhas safe after powerful Japan Earthquake | జపాన్ లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఇదే సమయంలో ప్రభాస్ ఎలా ఉన్నారో అని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మారుతీ స్పందించి ప్రభాస్ సేఫ్ అని స్పష్టం చేశారు. ‘బాహుబలి-ది ఎపిక్’ డిసెంబర్ 12న జపాన్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ మరియు నిర్మాత శోభు యార్లగడ్డ జపాన్ లో పర్యటిస్తున్నారు.
ప్రభాస్ అభిమానులతో మీట్ అవుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఇదే సమయంలో రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతతో జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించింది. అలాగే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సురక్షితంగా ఉన్నార అని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దింతో దర్శకుడు మారుతి స్పందించారు.
ప్రభాస్ తో ఫోన్లో మాట్లాడినట్లు ఆయన సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేశారు. భూకంపం సంభవించిన ప్రాంతంలో ప్రభాస్ లేరని క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ప్రభాస్-మారుతీ కాంబోలో తెరకెక్కిన ‘ది రాజసాబ్’ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.








