PM Modi Gifts Russian Edition Of Bhagavad Gita To Putin | రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చిన విషయం తెల్సిందే. ఢిల్లీలోని పాలం యూనివర్సిటీలో పుతిన్ కు స్వయంగా స్వాగతం పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. శుక్రవారం ఇరువురు దేశాధినేతలు ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పుతిన్ కు పలు ప్రత్యేకమైన బహుమతులు అందజేశారు మోదీ. భారతదేశ సాంస్కృతిక వారసత్వం, హస్తకళలు, ప్రాంతీయ ఉత్పత్తులను ప్రతిబింభించేలా ఈ బహుమతులు ఉన్నాయి.
తొలుత హిందూ పవిత్ర గ్రంథం అయిన శ్రీమద్ భగవద్గీతను రష్యన్ భాషలో అనువదించిన ప్రతిని ప్రధాని మోదీ పుతిన్ కు బహుకరించారు. అలాగే కశ్మీరీ కుంకుమ పువ్వు, మహారాష్ట్ర కు చెందిన చేతితో తయారు చేసిన వెండి గుర్రపు బొమ్మ, బ్రహ్మపుత్ర నదీ మైదానాల్లో పండే రుచికరమైన అస్సాం బ్లాక్ టీ, పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ లో ప్రత్యేకంగా తయారుచేసే అలంకృత టీ సెట్, ఆగ్రా ప్రత్యేకం అయిన మార్బుల్ చెస్ సెట్ ను ప్రధాని బహుకరించారు.









