Interesting Facts | ప్రపంచ, దేశ శతాబ్దాల చరిత్రలో ప్రతీ తేదీకి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు ప్రత్యేకత ఏంటి అని తెలుసుకోవాలని చాలామందికి ఉత్సుకత ఉంటుంది. ఇలా నవంబర్ 21న భారతదేశ చరిత్రలో పలు కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి.
స్వతంత్ర భారతంలో తొలి పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. 1947 నవంబర్ 21న భారత ప్రభుత్వం మువ్వన్నెల జెండా, జైహింద్ అనే నినాదంతో కూడిన తొలి పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. అప్పుడు ఈ స్టాంపు విలువ మూడున్నర అణాలు.
భారత్-చైనా మధ్య యుద్ధానికి ముగింపు పలుకుతూ చైనా 1962 నవంబర్ 21 నాడు సీజ్ ఫైర్ ప్రకటించింది.
లోధి వంశంలో చివరి సుల్తాన్ అయిన ఇబ్రహీం లోడీ 1517 నవంబర్ 21నాడు ఢిల్లీ సుల్తనేట్ సుల్తాన్ గా బాధ్యతలు స్వీకరించాడు. 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని మొఘల్ పాలకుడు బాబర్ ఓడించాడు. దీంతో భారత్ లో ఢిల్లీ సుల్తానేట్ ముగిసి మొఘల్ సామ్రాజ్యం వచ్చింది.
భారతదేశ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న సీవీ రామన్ 1970 నవంబర్ 21న తుదిశ్వాస విడిచారు.









