- విద్య అర్థవంతంగా, అన్వయాత్మకంగా ఉండాలి
- ఐబీఎస్ లో డా. భరత్ కుమార్ కక్కిరేణి
- నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఎడ్యువిజన్ చర్చాగోష్టి
IBS Hyderabad | జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని శంకర్ పల్లి మండలం దొంతన్ పల్లిలోని ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్ క్యాంపస్ లో ఎడ్యువిజన్: ఇన్నోవేషన్, ఇన్ క్లూజన్ అండ్ ఇంపాక్ట్ అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది.
ప్రొఫెసర్ శైలేంద్ర సింగ్ బీస్ట్ మోడరేటర్ గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో వక్తలుగా కేబీకే గ్రూప్ చైర్మన్ డా. భరత్ కుమార్ కక్కిరేణి, డిజిటల్ కనెక్ట్ సీఈవో నిఖిల్ గుండా, డాక్టర్ వినితా పాండే, ఎల్వినా మెనేజస్ కీలక అంశాలపై విద్యార్థులకు సూచనలు ఇచ్చారు.
విద్యా రంగంలో వస్తున్న రాబోతున్న మార్పులను పరిశీలిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ అండ్ ఇన్ క్లూజన్ అనే అంశాలపై సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్బంగా కేబీకే గ్రూప్ చైర్మన్ డా. భరత్ కుమార్ మాట్లాడుతూ విద్య అనేది మన అర్ధవంతమైనదిగా, నిజ జీవితానికి అన్వయాత్మకంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
మనం అభ్యసించిన విద్య సమాజం అవసరాలను తీర్చగలిగినప్పుడే ఆ విద్య లక్ష్యం పరిపూర్ణమవుతుందన్నారు. అనంతరం డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్ పర్ట్ నిఖిల్ గుండా మాట్లాడుతూ ఆర్టిఫిషీయల్ ఇంటలీజెన్స్ విద్యను ఎలా ప్రభావితం చేస్తుందో వివరించారు.








