What caused the Kurnool bus fire that killed 20 in Andhra Pradesh? | ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. కర్నూలు సమీపంలోని చిన్నటేకూరి వద్ద జాతీయ రహదారి 44పై బస్సు ప్రయాణిస్తుంది. ఇదే సమయంలో బస్సు బైక్ ను ఢీ కొట్టింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి కిందపడిపోగా, బైక్ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుని వచ్చింది. ఈ క్రమంలో పెట్రోల్ లీక్ అవ్వడంతో మంటలు చెలరేగాయి. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరు సిబ్బందితో పాటు నలభై మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది సజీవ దహనం అవ్వడం తీవ్ర విషాదానికి దారి తీసింది. అలాగే బస్సు ఢీ కొట్టడం మూలంగా ద్విచక్ర వహనదారుడు కూడా మృతి చెందారు. 21 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
క్షతగాత్రులను కర్నూలులోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల్లో అత్యధికులు హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన అనంతరం ఒక డ్రైవర్ పారిపోయాడు. మరో డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు.









