Customs Raid Homes of Dulquer Salmaan & Prithviraj Over Alleged Illegal Vehicle Purchases | భూటాన్ దేశం నుంచి భారత్ లోకి అత్యంత ఖరీదైన కార్లను స్మగ్లింగ్ చేశారని సమాచారంతో కస్టమ్స్ అధికారులు రంగంలోకి దిగారు.
మలయాళ అగ్ర నటులు దుల్కర్ సల్మాన్, ప్రిథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. కొచ్చి, తిరువనంతపురం లోని ప్రిథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ ఇళ్లల్లో అధికారులు స్మగ్లింగ్ చేసిన లగ్జరీ కార్ల కోసం తనికీలు చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను గుర్తించలేదని సమాచారం. కాగా ఇటీవల భూటాన్ ఆర్మీ కొన్ని ఖరీదైన కార్లను ఉపసంహరించుకుని వేలం నిర్వహించింది.
అయితే కొందరు ఏజెంట్లు అతి తక్కువ ధరకు వీటిని దక్కించుకుని భారత్ కు స్మగుల్ చేసినట్లు సమాచారం బయటకు వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ఈ కార్లకు రిజిస్ట్రేషన్ చేసి భారీ ధరకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇందులో 20కి పైగా కార్లు కేరళలోని పలువురు కొనుగోలు చేశారంట. ఈ నేపథ్యంలో అధికారులు తాజగా సోదాలు చేపట్టారు.









