Kavitha Kalvakuntla News | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో, బీఆరెస్ అధినేత కేసీఆర్ స్వగ్రామం అయిన చింతమడక గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా బతుకమ్మ సంబరాల్లో భాగంగా సెప్టెంబర్ 21న నిర్వహించే ఎంగిలిపూల బతుకమ్మ పండుగకు రావాలని కవితను ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో కవితను కలిశారు.
సొంత గ్రామ ప్రజలు పండుగకు తనను ఆహ్వానించడం పట్ల కవిత సంతోషం వ్యక్తం చేశారు. గొప్ప ఉద్యమకారుడిని కన్న గ్రామం చింతమడక అని పేర్కొన్నారు. గ్రామస్థులు తనను కలవడం ఎంతో ధైర్యాన్ని కలిగించిందని కవిత అన్నారు. కాగా ఇటీవలే బీఆరెస్ నుంచి కవితను కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే.









