PM Modi flags off Maruti Suzuki’s 1st electric vehicle e-Vitara | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం గుజరాత్ హన్సల్‌పూర్‌లోని సుజుకి మోటార్ ప్లాంట్‌లో మారుతి సుజుకి యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం ‘ఈ-విటారా’ని (e-Vitara) జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కారు భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాలకు ఎగుమతి కానుంది, ఇందులో తొలి యూనిట్ యూకేకు పంపబడుతుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఆత్మనిర్భర భారత్’ మరియు గ్రీన్ మొబిలిటీ దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడిందన్నారు.
ఈ ప్రాజెక్ట్ భారత్‌ను ఎలక్ట్రిక్ వాహన తయారీలో గ్లోబల్ హబ్‌గా మార్చడంతో పాటు, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రధాని హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ లను తయారు చేసే ప్లాంట్ కు కూడా శ్రీకారం చుట్టారు. ఈ ప్లాంట్ ను తోషిబా, డెన్సో, సుజుకీ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించారు.









