HM Amit Shah at Special Discussion on Operation Sindoor in Lok Sabha | జమ్మూకశ్మీర్ శ్రీనగర్ లోని దాచిగామ్ నేషనల్ పార్కు సమీపంలో నక్కిన ఉగ్రవాదులను భారత సైన్యం సోమవారం మట్టుబెట్టిన విషయం తెల్సిందే.
ఆపరేషన్ మహాదేవ్ లో మట్టుబెట్టిన ఉగ్రవాదులు పహల్గాం టెర్రరిస్టులే అని ప్రకటించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ మేరకు ‘ఆపరేషన్ సింధూర్’ పై లోకసభలో మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్ షా ఈ ప్రకటన చేశారు.
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. కీలక నిందితుడు సులేమాన్ కూడా ఇందులో ఉన్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారు అని చెప్పడానికి ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడి అమానుషం అని, మతం అడిగి మరీ పర్యాటకుల్ని చంపారని పేర్కొన్నారు. అలాగే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందని కేంద్రమంత్రి సభకు తెలియజేశారు.









