Telangana BJP President Elections | ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నియామకంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.
ఇరు రాష్ట్రాలకు అధ్యక్షుల పేర్లను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరును ఖరారు చేసింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఉన్న మాధవ్ ఆర్ఎస్ఎస్, బీజేవైఎంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
గతంలో శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గానూ పనిచేశారు. ఈయన బీజేపీ సీనియర్ నేత, దివంగత చలపతిరావు కుమారుడు. ఇక తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావును ఫిక్స్ చేసింది బీజేపీ అధిష్టానం.
పార్టీ ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నామినేషన్ వేయనున్నారు. మొదట ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, కె. లక్ష్మణ్, రామచందర్ రావు పేర్లు వినిపించగా చివరికి అధిష్టానం రామచందర్ రావును ఖరారు చేసింది.









