Monday 4th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతుంది..IAF కీలక ప్రకటన

‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతుంది..IAF కీలక ప్రకటన

Op Sindoor still ongoing: Air Force after India-Pak ceasefire | భారత వాయుసేన కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా తమకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేసినట్లు వాయిసేన ప్రకటించింది.

జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా వాయుసేన తన బాధ్యతలను ఖచ్చితత్వంతో నిర్వర్తించినట్లు పేర్కొంది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, త్వరలో వివరణాత్మక బ్రీఫింగ్ నిర్వహించబడుతుందని తెలిపింది. అప్పటివరకు అనధికార వార్తలను నమ్మవద్దని కోరింది.

ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ప్రాంతాల్లో ఉగ్రశిభిరాలపై దాడులు చేసిన విషయం తెల్సిందే. జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థల భారత సైన్యం ధాటికి కకావికలం అయ్యాయి.

అలాగే ఉగ్రవాది మసూద్ అజర్ కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు 14 మంది వరకు భారత ఆపరేషన్ సింధూర్ ధాటికి చనిపోయారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions