A credit card charge of Rs.299 is now Rs.22,00,000 | క్రెడిట్ కార్డు ( Credit Card ) వినియోగించుకుని అనంతరం చెల్లించకపోతే కంపెనీలు భారీ మొత్తంలో వడ్డీని వసూలు చేస్తుంటాయి.
ఇలాంటి ఘటనే తన స్నేహితుడికి ఎదురైందని ఓ వ్యక్తి రెడిట్ లో పోస్ట్ చేశాడు. 2007లో తన స్నేహితుడు క్రెడిట్ కార్డు ద్వారా రూ.299 లావాదేవీ జరిపినట్లు, అనంతరం డ్యూ కట్టకపోవడంతో ఇప్పుడు బ్యాంకుకు రూ.22 లక్షలు బాకీ పడినట్లు రిలయన్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ( Reliance Asset Reconstruction ) సంస్థ తాజగా సంప్రదించిందని ఆయన తెలిపారు.
2007లో తన స్నేహితుడు అసలు క్రెడిట్ కార్డును వినియోగించి లావాదేవీ చేశాడా అనే విషయం కూడా తనకు గుర్తులేదని పేర్కొన్నాడు. 2007లో డ్యూ చెల్లించకపోవడంతో అప్పటినుంచి వడ్డీలు వేయడంతో ఇప్పుడది రూ.22 లక్షలకు చేరిందని వెల్లడించారు.
బ్యాంకు తాజగా నోటీసులు పంపినట్లు చెప్పారు. అయితే నోటీసులు పంపడానికి బ్యాంకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేసిందని సదరు వ్యక్తి ప్రశ్నిస్తున్నారు. రూ.299 చిన్న లావాదేవీకి పెద్ద మొత్తంలో అడగడం సమంజసమేనా అని తోటి వారి సలహాను అడిగాడు.









