Sunday 6th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పాప్‌కార్న్ పై జీఎస్టీ పెంపు

పాప్‌కార్న్ పై జీఎస్టీ పెంపు

GST On Popcorn | పాప్‌కార్న్ పై మూడు వేర్వేరు జీఎస్టీ ( GST ) రేట్లు విధించడం ఇప్పుడు తెగ చర్చనీయాంశంగా మారింది.

సాల్టెడ్ ( Salted ) లేదా మసాలా పాప్‌కార్న్ లేబుల్ ( Lable ), ప్యాక్ లేకపోతే ఐదు శాతం జీఎస్టీ, ఒకవేళ ప్రీ ప్యాక్ ( Pre-Packaged ), లేబుల్ ( Labelled )ఉంటే 12% జీఎస్టీ వర్తించనున్నట్లు మండలి ( GST Counsil ) నిర్ణయం తీసుకుంది. అయితే షుగర్ కలిసిన పాప్‌కార్న్ కు మాత్రం జీఎస్టీని పెంచారు.

క్యారమెల్ పాప్‌కార్న్ ( Caramel Popcorn ) ను ప్యాకేజింగ్ తో అమ్మితే దానికి 18% జీఎస్టీ వర్తించనుంది. సాధారణంగా పాప్‌కార్న్ ను నమ్కీన్ ( Namkeen ) లా పరిగణిస్తారు. కానీ చాకలెట్ ( Chocolate ) కలిసిన పాప్‌కార్న్ ను నమ్ కీన్ లా పరిగణించలేమని జీఎస్టీ మండలి స్పష్టం చేసింది. ఈ కారణంగానే క్యారమెల్ పాప్‌కార్న్ కు 18% జీఎస్టీ విదిస్తున్నట్లు మండలి పేర్కొంది.

అయితే సులభతరం కోసం జీఎస్టీని తీసుకొచ్చామని చెబుతూ..ఇలా సంక్లిష్టంగా మార్చడం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పాప్‌కార్న్ పై జీఎస్టీ అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.

You may also like
దేశ స్వావలంబనకు 7 సూత్రాల’సప్తధార’: ప్రధాని మోదీ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions