Friday 27th December 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో హోంమంత్రి అనిత భేటీ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో హోంమంత్రి అనిత భేటీ

Pawan Kalyan-Anitha Meeting | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తో హోంమంత్రి వంగలపూడి అనిత ( Vangalapudi Anitha ) గురువారం భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వక భేటీ జరిగింది.

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు , హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి హోంమంత్రి తీసుకెళ్లారు.

చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం శ్రమించే ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా అనిత తెలిపారు. కాగా ఇటీవల పిఠాపురం ( Pitapuram ) లో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలో వీరిద్దరి భేటీ ఆసక్తిగా మారింది.

You may also like
కాంగ్రెస్ ఫ్లెక్సీలో కశ్మీర్ లేని ఇండియా మ్యాప్..చెలరేగిన వివాదం
19 ఏళ్ల క్రికెటర్ పై కోహ్లీ ప్రవర్తన తప్పు..ఐసీసీ భారీ ఫైన్
సీఎం అయ్యే అవకాశం వచ్చింది..సోనూసూద్ కామెంట్స్
సోఫా చేరాల్సిందే..సీఎంతో ఇండస్ట్రీ భేటీపై అంబటి రాంబాబు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions