Monday 30th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఆర్టికల్ 370..జమ్మూకశ్మీర్ అసెంబ్లీ లో యుద్ధం

ఆర్టికల్ 370..జమ్మూకశ్మీర్ అసెంబ్లీ లో యుద్ధం

Jammu and Kashmir Assembly Erupts Over Article 370 | నూతనంగా కొలువుదీరిన జమ్మూకశ్మీర్ ( Jammu Kashmir ) అసెంబ్లీలో సభ్యులు బాహాబాహికి దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

గురువారం జమ్మూ అసెంబ్లీ సమావేశాలు మొదలయిన వెంటనే ఇంజినీర్ రషీద్ ( Engineer Rashid ) సోదరుడు, ఎమ్మెల్యే ఖుర్షిద్ అహ్మద్ షేక్ ( Khurshid Ahmad Sheikh ) ఆర్టికల్ 370 ని పునరుద్ధరించాలని బ్యానర్ ను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ ( Sunil Sharma ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన మార్షల్స్ ( Marshals ) ఎమ్మెల్యేలను విడదీశారు. కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు పంపారు.

ఈ ఘటన పట్ల బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.మరోవైపు ఆర్టికల్ 370, 32ఎ ను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ పీడిపీ అసెంబ్లీలో తీర్మానం చేసింది. అంతేకాకుండా ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions