Monday 2nd March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అమెరికా ఉపాధ్యక్షుడు తెలుగింటి అల్లుడే!

అమెరికా ఉపాధ్యక్షుడు తెలుగింటి అల్లుడే!

jd vance as us vice president

JD Vance as US Vice President | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (America President) రిపబ్లికన్ పార్టీ (Republican Party) ఘన విజయం సాధించింది. డోనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ విజయోత్సవ సభలో మాట్లాడారు. అమెరికా చరిత్రలో ఇదో గొప్ప విజయమని అభివర్ణించారు.

తన విజయానికి సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడిని ప్రకటించారు. ఉపాధ్యక్షుడు జే.డీ.వాన్స్ అంటూ ప్రకటించేశారు. జేడీ వాన్స్ తెలుగింటి అల్లుడు. ఏపీలోని నిడదవోలు నియోజకవర్గం వడ్లూరుకు చెందిన ఉషా చిలుకూరి భర్త జే.డీ.వాన్స్.

ఉషా చిలుకూరి తల్లిదండ్రులది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు వద్ద ఉన్న చిన్న గ్రామం. చాలా ఏళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్‌ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా కూడా కాలిఫోర్నియాలోనే జన్మించారు.

శాన్ డియాగో, కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. యేల్ వర్శిటీలో ఉన్నప్పటి నుంచే జేడీ వాన్స్ – ఉషా చిలుకూరి ప్రేమించుకున్నారు. 2014లో కాలిఫోర్నియాలో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం.

You may also like
dhs
దేశం వదిలి వెళితే 3వేల డాలర్లు: ట్రంప్ సర్కార్!
trump wins
అమెరికాలో విదేశీ విద్యార్థులకు షాకింగ్ న్యూస్..ట్రంప్ సర్కార్ కీలక ప్రతిపాదన!
మెలానియాకు ముద్దుపెట్టబోయిన ట్రంప్..అడ్డొచ్చిన టోపి
ట్రంప్ టీమ్ లో మరో భారత సంతతి వ్యక్తి..కీలక బాధ్యతలు అప్పగించిన కాబోయే ప్రెసిడెంట్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions