Tuesday 22nd July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సీఎం యోగిని చంపేస్తామని బెదిరింపులు..24 ఏళ్ల మహిళ అరెస్ట్

సీఎం యోగిని చంపేస్తామని బెదిరింపులు..24 ఏళ్ల మహిళ అరెస్ట్

Death Threat To Yogi Adityanath | ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ శనివారం సాయంత్రం ముంబై పోలీసు కంట్రోల్ రూమ్ వాట్సప్ ( Whatsapp ) కు గుర్తుతెలియని నంబర్ నుండి మెస్సేజ్ వచ్చిన విషయం తెల్సిందే.

పది రోజుల్లో సీఎం పదవికి యోగి రాజీనామా చేయాలని లేదంటే మహారాష్ట్ర మాజీమంత్రి బాబా సిద్దిఖీ ( Baba Siddique ) లానే యూపీ సీఎంను కూడా హత్య చేస్తామని వార్నింగ్ ( Warning ) ఇచ్చారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు, ముంబై థానే ( Thane ) లోని 24 ఏళ్ల ఫాతిమా ఖాన్ ( fatima Khan ) ను అదుపులోకి తీసుకున్నారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఎస్సి చేసిన ఫాతిమా ఖాన్ థానే లోని ఉల్లాస్ నగర్ ( Ullasnagar ) లో ఉంటోంది. ఆమె తండ్రి కలప వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. యూపీ సీఎం యోగికి బెదిరింపుల మెస్సేజ్ చేసింది ఫాతిమా ఖానే అని పోలీసులు నిర్దారించారు. అయితే ఆమె మానసిక స్థితి బాగోలేదని పోలీసులు చెబుతున్నారు.

You may also like
‘నిధి అగర్వాల్ ను చూసి నాకే బాధ, సిగ్గనిపించింది’
గోడకు రంధ్రం చేసి..18 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
భార్య పాదాలకు నమస్కరించే నిద్రపోతా..రేసుగుర్రం నటుడు ఎమోషనల్
విద్యార్థిని ఘోరంగా కొట్టిన టీచర్..ఆరు నెలల జైలు, రూ.లక్ష ఫైన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions