దీపావళి ప్రాశస్త్యం
దీపజ్యోతిః పరబ్రహ్మం దీపజ్యోతిర్జనార్దనః ।
దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే ॥
సనాతన హిందూ సంప్రదాయ పండుగల్లో ఒకానొక ముఖ్యమైన పండుగ దీపావళి. ఐశ్వర్యానికి, ఆనందానికి సంకేతంగా దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినం దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. నరకాసుర సంహారం జరిగినందుకు సంతోషంగా ఈ పండుగ జరుపుకొంటారని పురాణాలు చెబుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకట్లను తరుపుతూ వెలుగులు నింపే పండుగగా ఈ దీపావళిని జరుపుకొంటారు. ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు.. కార్తీక శుక్ల విదియ నాడు ‘భగినీహస్త భోజనం’’తో ముగుస్తుంది.
ధన త్రయోదశి
ఆశ్వయుజ మాసం బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకొంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీ దేవి ఉద్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు లక్ష్మిదేవిని పూజిస్తే ఆ అమ్మ అనుగ్రహిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృతభాండం నమ్ముతారు. అందుకే ఈ త్రయోదశి నాడు బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. ఆ ఆభరణాలు ధన త్రయోదశి నాడు పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మీ, కుబేరులను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.
నరక చతుర్దశి
పురాణాల ప్రకారం భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో నరకాసురుడు జన్మించాడు. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందాడు. ఆ వరం పొందటంతో లోకకంటకుడిగా తయారై ముల్లోకాలను వేధించాడు. ఆ నరకాసురుడి బాధలు భరించలేక సకల దేవతలు, మునులు, గంధర్వులు శ్రీ మహా విష్ణువు వద్దకు వెళ్లి తమని రక్షించాలని గోడు వెళ్లబోసుకున్నారు. వారి ఆవేదన ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు.
దీపావళి
శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుడిని అంతం చేసిన మరుసటి రోజు దీపావళి పండుగ జరుపుకొంటారు. నరకాసురుడి బాధలు పోవడంతో ప్రజలంగా ఆనందోత్సాహాలతో అమవాస్య చీకట్లను తరిమేలా దీపాలు వెలిగించి ఈ దీపావళి జరుపుకొంటారు. అదే విధంగా లంకాధిపతి రావణాసురుడిని సంహరించి, సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపాలు వెలిగించి ఈ దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది.
బలి పాడ్యమి
విష్ణుమూర్తి వామనుడి రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి అణిచి వేసిన అనంతరం అతడి దానాలకు ప్రతిఫలంగా పాతాళ చక్రవర్తిగా నియమించి, ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి తన కోసం ఏమీ వద్దనీ, మానవుల కోసం వామనుడి మూడు అడుగులకు గుర్తుగా.. ఏటా మూడు రోజులు ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక పాడ్యమి నాడు భూలోకానికి తాను రాజుగా ఉండేలా అనుగ్రహించమని వేడుకుంటాడు. ఆ మూడురోజుల్లో ఎవరు దీపాలను వెలిగించి, దానం చేస్తారో వారికి సంపదను అనుగ్రహించు అని కోరుతాడు. విష్ణువు తథాస్తు అని దీవిస్తారు. అలా తాను పాలించిన భూమిని చూసేందుకు ఈ మూడు రోజులు సాయంకాలం వేళ బలి చక్రవర్తి, విష్ణువుతో కలసి కలసి వస్తాడని విశ్వసిస్తారు. అందుకే ఈ మూడు రోజులు ఆ వేళకి ఇంటి ముందు రంగవల్లులు వేసి, దీపాలు వెలిగిస్తారు. ఈ వేడుక చూసి తన ప్రజలంతా సంతోషంగా ఉన్నారని సంతోషపడి తిరిగి బలి పాతాళానికి వెళ్లే ఈ రోజునే బలి పాడ్యమి పేరుతో జరుపుకుంటున్నారు.
భగినీ హస్త భోజనం
దీపావళి అనంతరం రెండు రోజుల తర్వాత కార్తీక శుక్ల విదియ రోజున ఈ భగినీ హస్త భోజనం పండుగ జరుపుకొంటారు. భగినీ అంటే చెల్లెలు. ఆమె చేతితో వడ్డించిన భోజనం చేయడమే భగినీ హస్త భోజనం. పురాణాల ప్రకారం యమధర్మరాజుకు చెల్లెలు యమున. ఆమెకు అన్నపైన విపరీతమైన ప్రేమాభిమానం ఉంటుంది. ఆమె వివాహం తర్వాత తన అన్న యమధర్మరాజును తన ఇంటికి రావాలని అనేక సార్లు ఆహ్వానించింది. అయితే యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి కార్తీక శుక్ల విదియ రోజున తన సోదరి యమున ఇంటికి వెళ్లి భోజనం చేశాడు. సోదరుడికి యమున సంతోషంగా పిండివంటలతో భోజనం పెట్టింది. ఇరువురూ సంతోషంగా గడుపుతారు. ఆ క్షణంలో యమధర్మరాజు తన చెల్లెలు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆమె ఈ కార్తీక శుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్ళ భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరుతుంది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి, అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం అంటే అకాల మరణం లేకుండా ఉంటుందనీ, ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని అని వరాలిచ్చాడు. అందులో భాగంగా ఈ భగినీ హస్త భోజనం ఆచరణలోకి వచ్చింది.
దీపావళి రోజున వ్యాపారస్థులు తమ వ్యాపారాలు అభివృద్ధి చెందాలని లక్ష్మీ పూజ నిర్వహిస్తారు. ఐశ్వర్యానికి, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. దీపావళి ప్రతి పూజలోనూ విఘ్నేశ్వరుడిని ఆరాధించడం సంప్రదాయం. దీపావళి రోజు లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు.
విఘ్నేశ్వర స్వామి పూజ
(పసుపుతో విఘేశ్వరుని చేసి, తమలపాకులో ఉంచాలి. తమల పాకు చివర తూర్పు వైపునకుగాని, ఉత్తరత్తము వైపునకు గాని ఉండునట్లు ఉంచాలి. ఆ తమలపాకును ఒక పళ్లెంలో పోసిన బియ్యం ఉంచాలి. అనంతరం అగరవత్తులు వెలిగించి దీపారాధన చేయాలి)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః ।
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే ॥
య శ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా ।
తయో స్సంస్మరణా త్పుంసాం సర్వ తో జయమంగళం ॥
లాభస్తేషాం జయ స్తేషాం కుత స్తేషాం పరాభవః ।
యేషామిందీ వరశ్యామో హృదయస్థో జనార్ధనః ।।
ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం ।
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం।।
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ।।
( విఘేశ్వరుడిపై అక్షతలు వేసి, నమస్కరిస్తూ)
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీపురందరాభ్యాం నమః
ఇంద్రాది అష్టదిష్టక్పాలక దేవతాభ్యో నమః అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః
సీతారామాభ్యాం నమః మాతాపితృభ్యాం నమః
సర్వే భ్యో మహాజనేభ్యో నమః
(అనంతరం ఆచమనం చేస్తూ అంటే కింది మంత్రాలు చదువుతూ
కుడి అర చేతితో నీరు తీర్థంలాగ తాగాలి)
ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణ స్వాహా ఓం మాధవాయ స్వాహా
(అనంతరం కింది మంత్రాలను చదవాలి)
ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీ కేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః
(అనంతరం నీటిని పైకి, పక్కలకు, వెనక్కివెద జల్లుతూ కింది శ్లోకం పఠించాలి)
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
(అక్షతలు కొన్ని వాసన చూసి ఎడమచేతి పక్క నుంచి వెనుక్కి వేసుకోవాలి.
అనంతరం ప్రాణాయామం చేయాలి అంటే కుడి చేతి బొటన వేలు,
మధ్య వేలితో రెండు ముక్కు రంధ్రాలను మూసి ఈ మంత్రాలు చదవాలి)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయోయనః ప్రచోదయాత్
ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
( అని మూడు సార్లు జపించాలి)
(అనంతరం అక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకోవాలి)
సంకల్పము:
ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే, శోభన ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, కృష్ణా-గోదావర్యో మధ్యప్రదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పాలి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత తెలుగు సంవత్సరం పేరు) సంవత్సరే, (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు పేరు) ఋతౌ (ప్రస్తుత మాసం పేరు) మాసే, (ప్రస్తుత పక్షం పేరు) పక్షే, (ఈరోజు తిథి) తిథౌ, (ఈ రోజు వారము) వాసరే, (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే, (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే.
ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ, శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ (భార్య పేరు) సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్థం, సర్వాపదా నివారణార్థం, సకల కార్యవిఘ్ననివారణార్థం, శ్రీ లక్ష్మీ దేవతాపూజా సమయే శ్రీ మహా గణాధిపతి పూజాం కరిష్యే.
(అక్షతలు, నీరు కలిపి పళ్ళెంలో విడిచివేయాలి)
(అనంతరం కలశపూజ చేయాలి. కలశం అంటే నీళ్ళు ఉండే పాత్రకు గంధం,
కుంకుమ అలంకరించి అక్షతలు, పుష్పం వేసి ఎడమ అర చేతితో కింద పట్టుకొని
కుడిఅరచేతితో పైన పట్టుకోని కింది శ్లోకాలు చదవాలి)
తదంగ కలశ పూజాం కరిష్యే
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః ।
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాః స్మృతాః ।।
కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా ।
ఋగ్వేదో యజుర్వేదో స్సామవేదో అధర్వణః ।।
అంగై శ్చ సాహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణ్యాచ గౌతమీ
భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః
(కింది శ్లోకం చదువుతూ కలశంలోని నీటిని పుష్పంతో తీసుకొని
పూజా ద్రవ్యాల మీద, దేవుడి మీద, మీ మీద జల్లుకోవాలి)
అయాంతు శ్రీ మహా గణాధిపతి పూజార్థం మమ దురితక్షయ కారకాః
ఓం ఓం ఓం కలశోధకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య,
దేవానాం సంప్రోక్ష్య, ఆత్మానాం చ సంప్రోక్ష్య ।।
(అనంతరం ప్రాణప్రతిష్ట చేయాలి.. అనగా పసుపు గణపతిపై కుడిచేతిని
ఉంచి కింది మంత్రాలు చదవాలి)
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః
పునః ప్రాణ మిహనో దేహిభోగం
జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత
మనుమతే మృడయానః స్వస్తి
అమృతం వై ప్రాణా అమృతమాపః
ప్రాణానేవ యథాస్తానముపహ్వయతే
ఓం మహాగణపతయే నమః
స్థిరో భవ వరదో భవ
సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు।।
(కింది మంత్రం చదువుతూ ధ్యానం చేయాలి)
ఓం గణానాం త్వ గణపతిం హవామహే
కవిం కవీనా ముప మశ్రవ స్తమమ్
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్పత
ఆనః శృణ్వ న్నూతిభీస్సీద సాధనమ్।।
వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ
అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా॥
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః ధ్యాయామి
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి
తన్నోదంతి ప్రచోదయాత్।
ఓం శ్రీ మహా గణాధిపతియై నమః ధ్యాయామి – ధ్యానం సమర్పయామి.
(ఒక పుష్పమును దేవుడి వద్ద పెట్టాలి)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- ఆవాహయామి
(ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి వద్ద ఉంచవలెను)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- రత్న సింహాసనం సమర్పయామి
(కొన్ని అక్షతలు సమర్పించవలెను)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- పాదయోః పాద్యం సమర్పయామి
(పుష్పంతో నీరు దేవుడి పాదాలపై చల్లాలి)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
(పుష్పంతో నీరు దేవుడి చేతులపై చల్లాలి)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః – ముఖే ఆచమనీయం సమర్పయామి
(పుష్పంతో నీరు దేవుడి ముఖంపై చల్లాలి)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః – మధుపర్క స్నానం కరిష్యామి
రూపేణ అర్ఘ్యం సమర్పయామి
(పుష్పం తో నీరు దేవుడికి మధుపర్క స్నానానికి సమర్పించాలి)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః – శుద్ధోదక స్నానం సమర్పయామి
(దేవుడి స్నానం చేయిస్తున్నట్లు పుష్పంతో నీరు చల్లాలి)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః – వస్త్ర యుగ్మం సమర్పయామి –
వస్త్ర యుగ్మం రూపేణ అక్షతాన్ సమర్పయామి
(వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షతలు సమర్పించాలి)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి
(కుంకుమ ధారణ చేయాలి)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- యజ్ఞోపవీతం సమర్పయామి – యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి(అక్షతలు వేయాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- శ్రీ గంధం ధారయామి –
(గంధం సమర్పించాలి)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- సర్వాభరణాన్ ధారయామి
(అక్షతలు సమర్పించాలి)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి
(పువ్వులు/ అక్షతలు సమర్పించాలి)
ఓం శ్రీమహా గణాధిపతియై నమః
(యథా శక్తి మన ఇష్ట దైవం యొక్క మంత్ర జపాన్ని, అష్టోత్తర శత నామాన్ని
లేదా ప్రార్థన శ్లోకాన్ని చదువుకోవాలి)
నానావిధ పరిమళ పత్రపుష్పాక్షితై: పూజాం సమర్పయామి
ఓం శ్రీమహా గణాధిపతియై నమః ధూపమాఘ్రాపయామి
(అగరుబత్తి వెలిగించి దేవుడికి చూపించాలి)
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః దీపం దర్శయామి (దీపం చూపించాలి)
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః నైవేద్యం సమర్పయామి
(దేవుడి అర్పించే నైవైధ్యం పదార్థాల చుట్టూ గాయత్రి మంత్ర స్మరణ చేయాలి)
ఓం భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
(నైవేధ్యం పై కొంచెం నీటిని చిలకరించి, మూడుసార్లు పుష్పంతో
ఎడమ నుంచి కుడివైపునకు తిప్పాలి)
సత్యం త్వర్తేన పరిషించామి
ఋతం త్వా సత్యేన పరిషించామి
అమృతమస్తు అమృతో పస్తరణమసి
(కింది మంత్రాలు చదువుతూ బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేళ్ళ తో
భగవంతునికి నైవేధ్యం ఆరగింపు చేయాలి)
ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం పరబ్రహ్మణే నమః
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :-
తాంబూలం సమర్పయామి – తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి.
(తాంబూలం లేదా అక్షతలు సమర్పించాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి
(కర్పూర హారతి ఇవ్వాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- మంత్ర పుష్పం సమర్పయామి
(అక్షతలు, పువ్వులు సమర్పించవలెను).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- నమస్కారం సమర్పయామి
(ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను)
యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ
త్రాహి మాం నరకాత్ ఘోరాత్ శరణాగత
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వరా!
మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయా చ
భగవాన్ సర్వాత్మక శ్రీ గణపతి దేవతా సుప్రీతో వరదో భవతు
శ్రీ వినాయక ప్రసాదం శిరసా గృహ్ణామి.
(గణపతికి నమస్కరించి స్వామి వద్ద ఉన్న అక్షతలు తీసి
తలపై వేసుకొని ప్రసాదం స్వీకరించాలి)
గణపతి పూజ సమాప్తం
లక్ష్మీ దేవి పూజ
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణ స్వాహా ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీ కేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం శ్రీ సూక్త విధనేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
ధ్యానం:
యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మ పత్రాయతాక్షీ ।
గంభీరా వర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా ।।
లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభైః ।
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా ।।
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్ ।
దాసీభూతసమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ ।।
శ్రీమన్మన్దకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేన్ద్రగంగాధరాం ।
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వన్దే ముకున్దప్రియామ్ ।।
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ధ్యాయామి
ఆవాహనం
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ ।
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ।।
ఓం సర్వలోకస్యజననీం శూలహస్తాం త్రిలోచనామ్ ।
సర్వదేవమయీమీశాం దేవీమావాహయామ్యహమ్।।
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆవాహయామి
ఆసనం
తాం మ ఆవహజాతవేదో లక్ష్మీమనపగామినీమ్ ।
యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషానహమ్ ।।
ఓం తప్తకాంచనవర్ణాభం ముక్తామణివిరాజితమ్ ।
అమలం కమలం దివ్యమాసనం ప్రతిగృహ్యతామ్ ।।
ఓం శ్రీ మహాలక్ష్మై నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి
పాద్యం
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్ ।
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీర్జుషతామ్ ।।
ఓం గంగాదితీర్థసమ్భూతం గంధపుష్పాక్షతైర్యుతమ్ ।
పాద్యం దదామ్యహం దేవి గృహాణాశు నమోస్తు తే ।।
ఓం శ్రీ మహాలక్ష్మై నమః పాదయోః పాద్యం సమర్పయామి
అర్ఘ్యం
కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్ ।
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయేశ్రియమ్ ।।
అష్టగంధసమాయుక్తం స్వర్ణపాత్రప్రపూరితమ్ ।
అర్ఘ్యం గృహాణ మద్దత్తం మహాలక్ష్మై నమోస్తు తే ।।
ఓం శ్రీ మహాలక్ష్మై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం
చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ ।
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనశ్యతాం త్వాం వృణే ।।
ఓం సర్వలోకస్య యా శక్తిః బ్రహ్మవిష్ణ్వాదిభిః స్తుతా ।
దదామ్యాచమనం తస్యై మహాకాళ్యై మనోహరమ్ ।।
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి
మహాలక్ష్మీదేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి
శుద్ధోదకస్నానం
ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః |
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాన్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ||
ఓం పంచామృత సమాయుక్తం జాహ్నవీసలిలం శుభమ్ |
గృహాణ విశ్వజనని స్నానార్థం భక్తవత్సలే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ |
ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే ||
ఓం దివ్యాంబరం నూతనం హి క్షౌమంత్వతిమనోహరమ్ |
దీయమానం మయా దేవి గృహాణ జగదంబికే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
మధుపర్కం
కాపిలం దధి కున్దేన్దుధవలం మధుసంయుతమ్ |
స్వర్ణపాత్రస్థితం దేవి మధుపర్కం గృహాణ భోః ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః మధుపర్కం సమర్పయామి |
ఆభరణం
క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్ |
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ ||
ఓం రత్నకంకణ వైఢూర్య ముక్తాహారాదికాని చ |
సుప్రసన్నేన మనసా దత్తని స్వీకురుష్వ భోః ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆభరణాని సమర్పయామి |
గంధం, చందనం, పసుపు, కుంకుమ, పూలు
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ |
ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ||
శ్రీఖండాగరుకర్పూర మృగనాభిసమన్వితమ్ |
విలేపనం గృహాణాశు నమోఽస్తు భక్తవత్సలే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః చందనం సమర్పయామి |
ఓం రక్తచందనసమ్మిశ్రం పారిజాత సముద్భవమ్ |
మయాదత్తం గృహాణాశు చందనం గంధసంయుతం ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః రక్తచందనం సమర్పయామి |
ఓం సింధూరం రక్తవర్ణం చ సిందూరతిలకప్రియే |
భక్త్యా దత్తం మయా దేవి సింధూరం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః సింధూరం సమర్పయామి |
కుంకుమం కామదం దివ్యం కుంకుమం కామరూపిణమ్ |
అఖండ కామసౌభాగ్యం కుంకుమ ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః కుంకుమం సమర్పయామి |
ఓం తైలాని చ సుగంధీని ద్రవ్యాణి వివిధాని చ |
మయా దత్తాని లేపార్థం గృహాణ పరమేశ్వరి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః సుగంధి తైలం సమర్పయామి |
మనస: కామమాకూతిం వాచః సత్యమశీమహి |
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశ: ||
ఓం మందారపారిజాతాదీన్పాటలీం కేతకీం తథా |
మరువామోగరం చైవ గృహాణాశు నమోస్తు తే |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః పుష్పాణి సమర్పయామి |
ఓం విష్ణ్వాదిసర్వదేవానాం ప్రియాం సర్వసుశోభనమ్ |
క్షీరసాగరసంభూతే దూర్వాం స్వీకురు సర్వదా ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః దుర్వాః సమర్పయామి |
పూల మాల
కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ |
శ్రియం వాసయ మే కులే మాతర పద్మమాలినీమ్ ||
ఓం పద్మశంఖజపాపుష్పైః శతపత్రైర్విచిత్రితామ్ |
పుష్పమాలాం ప్రయచ్ఛామి గృహాణ త్వం సురేశ్వరి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః పుష్పమాలామ్ సమర్పయామి |
అథాంగ పూజ
ఓం చపలాయై నమః – పాదౌ పూజయామి
ఓం చంచలాయై నమః – జానునీ పూజయామి
ఓం కమలాయై నమః – కటిం పూజయామి
ఓం కాత్యాయన్యై నమః – నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః – జఠరం పూజయామి
ఓం విశ్వవల్లభాయై నమః – వక్షస్స్థలం పూజయామి
ఓం కమలవాసిన్యై నమః – నేత్రత్రయం పూజయామి
ఓం శ్రియై నమః – శిరః పూజయామి
ఓం మహాలక్ష్మై నమః – సర్వాణ్యంగాని పూజయామి
అథ పూర్వాదిక్రమేణాష్టదిక్ష్వష్టసిద్ధీః పూజయేత్ |
ఓం అణిమ్నే నమః ఓం మహిమ్నే నమః ఓం గరిమ్ణే నమః
ఓం లఘిమ్నే నమః ఓం ప్రాప్త్యై నమః ఓం ప్రాకామ్యాయై నమః
ఓం ఈశితాయై నమః ఓం వశితాయై నమః
అథ పూర్వాదిక్రమేణాష్టలక్ష్మీ పూజయేత్ |
ఓం ఆదయలక్ష్మా నమః ఓం విద్మయలక్ష్మా నమః ఓం సౌభాగయలక్ష్మా నమః
ఓం అమృత్లక్ష్మా నమః ఓం క్తమలక్ష్మా నమః ఓం సత్యలక్ష్మా నమః
ఓం భగలక్ష్మా నమః ఓం యగలక్ష్మా నమః
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి
ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహిత ప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః ఓం పద్మాలయాయై నమః
ఓం పద్మాయై నమః ఓం శుచయే నమః
ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః
ఓం అదిత్యై నమః ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః
ఓం కన్తాయై నమః ఓం క్షమాయై నమః
ఓం క్షీరోదసంభవాయై నమః ఓం అనుగ్రహపరాయై నమః
ఓం ఋద్దయే నమః ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః
ఓం లోకశోకవినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః ఓం పుణ్య గంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాద జనన్యై నమః ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః ఓం పుష్టయే నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతీపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధయే నమః ఓం స్త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేశ్మగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః
ఓం మంగళదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితయే నమః
ఓం స్థితాయై నమః ఓం విష్ణుపత్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః
ఇతి శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః సమాప్తః
ధూపం
ఆప: సృజన్తు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే |
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ||
ఓం వనస్పతిరసోత్పన్నో గంధాఢ్యస్సుమనోహరః |
ఆఘ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ధూపం సమర్పయామి |
దీపం
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పిఙ్గలాం పద్మమాలినీమ్ |
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
ఓం కర్పూరవర్తిసంయుక్తం ఘృతయుక్తం మనోహరమ్ |
తమోనాశకరం దీపం గృహాణ పరమేశ్వరి ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః దీపం సమర్పయామి |
నైవేద్యం
ఆర్ద్రాంయః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్ |
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
ఓం నైవేద్యం గృహ్యతాం దేవి భక్ష్యభోజ్యసమన్వితమ్ |
షడ్రసైరన్వితం దివ్యం లక్ష్మీదేవి నమోస్తు తే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి
అమృతమస్తు అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి
తాంబూలం
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్విన్దేయం పురుషానహమ్ ||
ఓం ఏలాలవంగకర్పూరనాగపత్రాదిభిర్యుతమ్ |
పూగీఫలేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః తాంబూలం సమర్పయామి |
ఫలం
ఓం ఫలేన ఫలితం సర్వం త్రైలోక్యం సచరాచరమ్ |
తస్మాత్ఫలప్రదానేన పూర్ణాస్సన్తు మనోరథాః ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఫలం సమర్పయామి |
దక్షిణం
ఓం హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః |
అనంతపుణ్యఫలదం అతః శాన్తిం ప్రయచ్ఛమే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః దక్షిణాం సమర్పయామి |
నీరాజనం
ఆనన్దః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః |
ఋషయః తే త్రయః పుత్రాః స్వయం శ్రీదేవి దేవతా ||
ఓం చక్షుర్దం సర్వలోకానాం తిమిరస్య నివారణమ్ |
ఆర్తిక్యం కల్పితం భక్త్యా గృహాణ పరమేశ్వరి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి
మంత్రపుష్పం
ఓం మహాదేవ్యై చవిద్మహే విష్ణుపత్నీ చధీమహి |
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ||
ఓం కేతకీజాతికుసుమైర్మల్లికామాలతీభవైః |
పుష్పాంజలిర్మయాదత్తస్తవప్రీత్యై నమోస్తు తే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి |
ప్రార్థన
ఓం సురాసురేంద్రాదికిరీటమౌక్తికై- -ర్యుక్తం సదా యత్తవపాద కంజనమ్ |
పరావరం పాతు వరం సుమంగళం నమామి భక్త్యా తవ కామసిద్ధయే ||
భవాని త్వం మహాలక్ష్మి సర్వకామప్రదాయినీ |
సుపూజితా ప్రసన్నాస్యాన్మహాలక్ష్మై నమోఽస్తు తే ||
నమస్తే సర్వదేవానాం వరదాసి హరిప్రియే |
యా గతిస్త్వత్ప్రపన్నానాం సా మే భూయాత్త్వదర్చనాత్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి |
సర్వోపచారాలు
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః గజానారోహయామి |
సమస్త రాజ్ఞీయోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి |
ఆత్మప్రదక్షిణ నమస్కారం
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవీ శరణాగతవత్సలే |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
సాష్టాంగ నమస్కారం:
నమస్తే లోకజనని నమస్తే విష్ణు వల్లభే పాహిమాం |
భక్తవరదే శ్రీలక్ష్మ్యైతే నమో నమః |
శ్రీలక్ష్మీదేవ్యై నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి
క్షమా ప్రార్థన
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతమ్ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ |
యత్పూజితం మయాదేవీ పరిపూర్ణం తదస్తుతే ||
అనయా శ్రీసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవతీ సర్వాత్మికా శ్రీ మహాలక్ష్మై సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||
తీర్థప్రసాదం
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం |
సమస్తపాపక్షయకరం శ్రీ మహాలక్ష్మీ పాదోదకం పావనం శుభం ||
శ్రీ మహాలక్ష్మై నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |
(అమ్మవారి దగ్గర పూజ చేసిన పూలుతీసుకుని, అక్షతలు తలపై వేసుకోవాలి)
కుబేర స్వామి పూజ
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణ స్వాహా ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీ కేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ సహ కుటుంబస్య మమ చ సర్వేషాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం పుత్ర పౌత్రాభావృద్ధ్యర్థం సమస్త మంగళవ్యాప్త్యర్థం ధన కనక వస్తు వాహన ధేను కాంచన సిద్ధర్థ్యం మమ మనః చింతిత సకల కార్య అనుకూలతా సిద్ధర్థ్యం సర్వాభీష్ట సిద్ధర్థ్యం శ్రీ సూక్త విధానేన శ్రీ కుబేర షోడశోపచార పూజాం కరిష్యే.
అస్మి న్ బింబే సాంగం సాయుధం సవాహనం సపరివారసమేత శ్రీ కుబేర స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి।
ధ్యానం:
మనుజ బాహ్య విమాన వర స్థితం గరుడ రత్న నిభం నిధినాయకమ్ |
శివసఖం ముకుటాది విభూషితం వర గదే దధతం భజ తుం దిలమ్ ||
కుబేరం మనుజాసీనం సగర్వం గర్వ విగ్రహమ్ |
స్వర్ణచ్ఛాయం గదాహస్తం ఉత్తరాధిపతింస్మరేత్ ||
ఓం శ్రీ కుబేర స్వా మినే నమః ధ్యాయామి ||
ఆవాహనం
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ ।
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ।।
ఆవాహయామి దేవేశ కుబేర వరదాయక |
శక్తిసంయుత మాం రక్ష బిం బేస్మి న్ సన్నిధింకురు ||
ఓం శ్రీ కుబేర స్వా మినే నమః ఆవాహయామి |।
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆవాహయామి
ఆసనం
తాం మ ఆవహజాతవేదో లక్ష్మీమనపగామినీమ్ ।
యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషానహమ్ ।।
విచిత్రరత్నఖచితం దివ్యాంబరసమన్వితమ్ ।
కల్పితం చ మయా భక్త్యా స్వీకురుష్వ దయానిధే ।।
ఓం శ్రీ కుబేర స్వామినే నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |
పాద్యం
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్ ।
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీర్జుషతామ్ ।।
సర్వ తీర్థ సమానీతం పాద్యం గంధాది సంయుతమ్ ।
యక్షేశ్వర గృహాణేదం భగవన్ భక్తవత్సల।।
ఓం శ్రీ కుబేర స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి ।
అర్ఘ్యం
కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్ ।
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయేశ్రియమ్ ।।
రక్త గంధాక్షతోపేతం సలిలం పావనం శుభమ్।
అర్ఘ్యం గృహాణ దేవేశ యక్షరాజ ధనప్రియ।।
ఓం శ్రీ కుబేర స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి।
ఆచమనీయం
చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ ।
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనశ్యతాం త్వాం వృణే ।।
కుబేర దేవదేవేశ సర్వ సిద్ధిప్రదాయక ।
మయా దత్తం యక్షరాజ గృహాణాచమనీయకమ్ ।।
ఓం శ్రీ కుబేర స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి।
శుద్ధోదకస్నానం
ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః ।
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాన్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ।।
గంగాది సర్వ తీర్థేభ్యై రానీతం తోయముత్తమమ్ ।
భక్త్యా సమర్పి తం తుభ్యం గృ హాణ ధననాయక ।।
ఓం శ్రీ కుబేర స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ।
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।
వస్త్రం
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ।
ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తి మృద్ధిం దదాతు మే ।।
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్ |
శుభప్రదం గృహాణ త్వం రక్ష యక్షకులేశ్వ ర ।।
ఓం శ్రీ కుబేరస్వామినే నమః వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి ।
యజ్ఞోపవీతం
క్షుత్పిపాసామలాం జ్యేష్టామలక్ష్మీం నాశయామ్యహమ్ |
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ ||
స్వర్ణసూత్రసమాయుక్తం ఉపవీతం ధనేశ్వర |
ఉత్తరీయేణ సహితం గృహాణ ధననాయక ||
ఓం శ్రీ కుబేర స్వామినే నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి|
గంధం
– గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ |
ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ||
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్ |
గంధం గృహాణ విత్తేశ సర్వసిద్ధిప్రదాయక ||
ఓం శ్రీ కుబేర స్వామినే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి |
ఓం శ్రీ కుబేర స్వామినే నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరీ
గోరోజనాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి |
ఆభరణం
మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి |
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః ||
రత్నకంకణ వైఢూర్య ముక్తాహారాదికాని చ
సుప్రసన్నేన మనసా దత్తాని స్వీకురుష్వ భోః ||
ఓం శ్రీ కుబేర స్వామినే నమః ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి |
పుష్పాణి
కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ |
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ ||
మాల్యాదీని సుగంధీని మాలత్యాదీని వై ప్రభో |
మయాహృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ కుబేర స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |
అథాంగ పూజ
ఓం అలకాపురాధీశాయ నమః పాదౌ పూజయామి |
ఓం గుహ్యేశ్వరాయ నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం కోశాధీశాయ నమః – జంఘే పూజయామి |
ఓం దివ్యాంబరధరాయ నమః – ఊరూం పూజయామి |
ఓం యక్షరాజాయ నమః – కటిం పూజయామి |
ఓం అశ్వారూఢాయ నమః నాభిం పూజయామి |
ఓం శివప్రియాయ నమః – హృదయం పూజయామి |
ఓం ధనాధిపాయ నమః – బాహూన్ పూజయామి |
ఓం మణికర్ణికాయ నమః – కంఠం పూజయామి |
ఓం ప్రసన్నవదనాయ నమః – ముఖం పూజయామి |
ఓం సునాసికాయ నమః నాసికాం పూజయామి |
ఓం విశాలనేత్రాయ నమః – నేత్రే పూజయామి |
ఓం కుబేరాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |
శ్రీ కుబేర అష్టోత్తర శతనామావళి
ఓం కుబేరాయ నమః ఓం ధనదాయ నమః
ఓం శ్రీమదే నమః ఓం యక్షేశాయ నమః
ఓం గుహ్యకేశ్వరాయ నమః ఓం నిధీశాయ నమః
ఓం శంకరసఖాయ నమః ఓం మహాలక్ష్మీనివాసభువయే నమః
ఓం మహాపద్మనిధీశాయ నమః ఓం పూర్ణాయ నమః
ఓం పద్మనిధీశ్వరాయ నమః ఓం శంఖాఖ్య నిధినాథాయ నమః
ఓం మకరాఖ్యనిధిప్రియాయ నమః ఓం సుఖఛాప నిధినాయకాయ నమః
ఓం ముకుందనిధినాయకాయ నమః ఓం కుందాక్యనిధినాథాయ నమః
ఓం నీలనిత్యాధిపాయ నమః ఓం మహతే నమః
ఓం వరనిత్యాధిపాయ నమః ఓం పూజ్యాయ నమః
ఓం లక్ష్మీసామ్రాజ్యదాయకాయ నమః ఓం ఇలపిలాపతయే నమః
ఓం కోశాధీశాయ నమః ఓం కులోధీశాయ నమః
ఓం అశ్వరూపాయ నమః ఓం విశ్వవంద్యాయ నమః
ఓం విశేషజ్ఞానాయ నమః ఓం విశారదాయ నమః
ఓం నళకూభరనాథాయ నమః ఓం మణిగ్రీవపిత్రే నమః
ఓం గూఢమంత్రాయ నమః ఓం వైశ్రవణాయ నమః
ఓం చిత్రలేఖామనప్రియాయ నమః ఓం ఏకపింకాయ నమః
ఓం అలకాధీశాయ నమః ఓం పౌలస్త్యాయ నమః
ఓం నరవాహనాయ నమః ఓం కైలాసశైలనిలయాయ నమః
ఓం రాజ్యదాయ నమః ఓం రావణాగ్రజాయ నమః
ఓం చిత్రచైత్రరథాయ నమః ఓం ఉద్యానవిహారాయ నమః
ఓం సుకుతూహలాయ నమః ఓం మహోత్సహాయ నమః
ఓం మహాప్రాజ్ఞాయ నమః ఓం సదాపుష్పకవాహనాయ నమః
ఓం సార్వభౌమాయ నమః ఓం అంగనాథాయ నమః
ఓం సోమాయ నమః ఓం సౌమ్యదికేశ్వరాయ నమః
ఓం పుణ్యాత్మనే నమః ఓం పురూహతశ్రీయై నమః
ఓం సర్వపుణ్యజనేశ్వరాయ నమః ఓం నిత్యకీర్తయే నమః
ఓం లంకాప్రాక్తన నాయకాయ నమః ఓం యక్షాయ నమః
ఓం పరమశాంతాత్మనే నమః ఓం యక్షరాజే నమః
ఓం యక్షిణివిరుత్తాయ నమః ఓం కిన్నరేశ్వరాయ నమః
ఓం కింపురుషనాథాయ నమః ఓం ఖడ్గాయుధాయ నమః
ఓం వశినే నమః ఓం ఈశానదక్షపార్శ్వస్థాయ నమః
ఓం వాయునామసమాశ్రయాయ నమః ఓం ధర్మమార్గైకనిరతాయ నమః
ఓం ధర్మసంముఖసంస్థితాయ నమః ఓం నిత్యేశ్వరాయ నమః
ఓం ధనాధ్యక్షాయ నమః ఓం అష్టలక్ష్మ్యాశ్రీతాలయాయ నమః
ఓం మనుష్యధర్మణ్యే నమః ఓం సకృతాయ నమః
ఓం కోశలక్ష్మీసమాశ్రితాయ నమః ఓం ధనలక్ష్మీనిత్యవాసాయ నమః
ఓం ధాన్యలక్ష్మీనివాసభువయే నమః ఓం అశ్వలక్ష్మీసదావాసాయ నమః
ఓం గజలక్ష్మీస్థిరాలయాయ నమః ఓం రాజ్యలక్ష్మీజన్మగేహాయ నమః
ఓం ధైర్యలక్ష్మీకృపాశ్రయాయ నమః ఓం అఖండైశ్వర్యసంయుక్తాయ నమః
ఓం నిత్యానందాయ నమః ఓం సుఖాశ్రయాయ నమః
ఓం నిత్యతృప్తాయ నమః ఓం నిధివేత్రే నమః
ఓం నిరాశాయ నమః ఓం నిరుపద్రవాయ నమః
ఓం నిత్యకామాయ నమః ఓం నిరాకాంక్షాయ నమః
ఓం నిరుపాధికవాసభువయే నమః ఓం శాంతాయ నమః
ఓం సర్వగుణోపేతాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సర్వసమ్మతాయ నమః ఓం సర్వాణికరుణాపాత్రాయ నమః
ఓం సదానంద కృపాలయాయ నమః ఓం గంధర్వకులసంసేవ్యాయ నమః
ఓం సౌగంధిక కుసుమప్రియాయ నమః ఓం స్వర్ణనగరీవాసాయ నమః
ఓం నిధిపీఠసమాశ్రితాయ నమః ఓం మహామేరుద్రాస్తాయనే నమః
ఓం మహర్షీగణసంస్తుతాయ నమః ఓం తుష్టాయ నమః
ఓం శూర్పణకా జ్యేష్ఠాయ నమః ఓం శివపూజారథాయ నమః
ఓం అనఘాయ నమః ఓం రాజయోగసమాయుక్తాయ నమః
ఓం రాజశేఖరపూజయే నమః ఓం రాజరాజాయ నమః
ఓం కుబేరాయ నమః ఇతి శ్రీ కుబేర అష్టోత్తర శతనామావళి సంపూర్ణమ్ ||
ధూపం
ఆప: సృజన్తు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే |
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే |
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరమ్ |
ధూపం కుబేర గృహ్లిష్య ప్రసన్నో భవ సర్వదా ||
ఓం శ్రీ కుబేర స్వామినే నమః ధూపం ఆఘ్రాపయామి |
దీపం
యః కరిణీం యష్టిం పిఙ్గలాం పద్మమాలినీమ్ |
చన్దాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆ వహ ||
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం యక్షేశ్వర నమోస్తు తే ||
ఓం శ్రీ కుబేర స్వామినే నమః దీపం దర్శయామి|
నైవేద్యం
ఆర్దాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీమ్ |
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆ వహ ||
నైవేద్యం షడ్రసోపేతం ఫలయుక్తం మనోహరమ్ |
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం ధనాధిప ||
ఓం శ్రీ కుబేర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి
అమృతమస్తు అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా
ఓం సమానాయ స్వాహా
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి
తాంబూలం
తాం మ ఆ వహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వాన్విన్దేయం పురుషానహమ్ ||
పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీ దళైర్యుతమ్ |
ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ కుబేర స్వామినే నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం
సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యా చ నో గృహే |
లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖే తయా మా సగ్ం సృజామసి ||
సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు |
నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు ||
ఓం శ్రీ కుబేర స్వామినే నమః కర్పూర నీరాజనం దర్శయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
నమస్కరోమి |
మంత్రపుష్పం
ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే |
నమో వయం వై శ్రవణాయ కుర్మహే |
స మే కామాన్కామకామాయ మహ్యమ్ |
కామేశ్వరో వై శ్రవణో దదాతు |
కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ||
ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్ ||
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః |
ఓం హ్రీం శ్రీం హ్రీం కుబేరాయ నమః |
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే
ధనధాన్యసమృద్ధిం మే దేహి దాపయ స్వాహా ||
ఓం శ్రీ కుబేర స్వామినే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |
ఆత్మప్రదక్షిణ నమస్కారం
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవీ శరణాగతవత్సలే |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా |
ఓం శ్రీ కుబేర స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
సాష్టాంగ నమస్కారం:
ఉరసా శిరసా దృ ష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాం గముచ్య తే ||
ఓం శ్రీ కుబేర స్వా మినే నమః సాష్టాం గ నమస్కా రాన్ సమర్ప యామి |
ప్రార్థన
ధనదాయ నమస్తుభ్యం నిధిపద్మాధిపాయ చ
భవంతు త్వత్ప్రసాదాన్మే ధనధాన్యాదిసంపదః ||
ఓం శ్రీ కుబేర స్వామినే నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి |
పునః పూజ
ఓం శ్రీ కుబేర స్వామినే నమః ఛత్రమాచ్ఛాదయామి |
ఓం శ్రీ కుబేర స్వామినే నమః చామరైర్వీజయామి
ఓం శ్రీ కుబేర స్వామినే నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ కుబేర స్వామినే నమః గీతం శ్రావయామి ||
ఓం శ్రీ కుబేర స్వామినే నమః ఆందోళికానారోహయామి |
ఓం శ్రీ కుబేర స్వామినే నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ కుబేర స్వామినే నమః గజానారోహయామి |
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |
క్షమా ప్రార్థన –
అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా
దాస్కోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర |
ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్ |
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వర |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర ||
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే |
అనయా శ్రీసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది
షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః
శ్రీ కుబేర స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||
తీర్థప్రసాదం
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణమ్ |
సమస్తపాపక్షయకరం శ్రీ లక్ష్మీ కుబేర పాదోదకం పావనం శుభం ||
శ్రీ కుబేర స్వామి ప్రసాదం శిరసా గృష్ణామి |
ఓం శాంతి శాంతి శాంతిః