Monday 12th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అవినీతిని ప్రశ్నిస్తూ యమునా నదిలో స్నానం..ఆసుపత్రి పాలైన నేత

అవినీతిని ప్రశ్నిస్తూ యమునా నదిలో స్నానం..ఆసుపత్రి పాలైన నేత

BJP Leader Virendraa Takes Dip In Yamuna River | యమునా నది ( Yamuna River ) దేశరాజధాని ఢిల్లీ ( Delhi ) చేరుకున్న అనంతరం విషపురితమైన వ్యర్ధాలు అధికంగా కలుస్తూ ఉంటాయి. కొన్ని సమయంలో ఈ విషం కారణంగా యమునా నదిలో నురుగు బయటకు వస్తుంది.

ఇలాంటి యమునా నదిలో నిరసన తెలిపేందుకు ఓ నేత స్నానం చేశారు. ఆఖరికి ఆసుపత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే, ఛత్ పూజ ( Chhath Puja ) సమీపిస్తున్న వేళా దేశరాజధానిలో అధికారంలో ఉన్న ఆప్ ( AAP ) ప్రభుత్వం యమునా నదిని శుద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా, యమునా నది ప్రక్షాళనకు కేటాయించిన నిధుల్లో ఆప్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఆప్ ప్రభుత్వ అవినీతికి నిరసనగా ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవ్ ( Virendraa Sachdev ) యమునా నదిలోకి దిగారు.

యమునా ఘాట్ వద్ద గురువారం యమునా నదిలోకి దిగిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షులు అక్కడ స్నానం చేశారు. ఈ ఘటన జరిగిన మరుసటిరోజె ఆయన ఆసుపత్రిలో చేరారు. ఊపిరి తీసుకోవడంలో సమస్య, స్కిన్ అలెర్జీ ( Skin Allergy ) వంటి సమస్యలతో వీరేంద్ర ఆర్ఎంఎల్ ( RML ) నర్సింగ్ ఆసుపత్రిలో చేరారు.

చికిత్స చేసిన వైద్యులు మూడు రోజులకు సరిపడ మెడిసన్ ఇచ్చారు. అయితే తన ఆరోగ్యం కంటే యమునా నది ప్రక్షాళనే తనకు ముఖ్యం అని సదరు నేత ప్రకటించారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions