Tuesday 4th August 2026
12:07:03 PM
Home > తాజా > మంత్రుల ఫోన్  ట్యాప్ చేస్తున్నారు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు!

మంత్రుల ఫోన్  ట్యాప్ చేస్తున్నారు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు!

ktr comments

KTR Comments on Phone Tapping | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన కేబినెట్ లోని మంత్రులతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను టాప్ చేస్తున్నారని కామెంట్ చేశారు.

హైదరాబాద్‍లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కెమెరాల ముందు ఫోట్ ట్యాపింగ్ అంశంపై లై డిటెక్టర్ పరీక్షకు రావాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో మంత్రులతో పాటు తన ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని సీఎం రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.

ఓ వైపు ఢిల్లీలో రాహుల్ గాంధీ డెమోక్రసీ అది ఇది అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నాడని.. ఇక్కడ మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పిల్లల మీద ఆ పార్టీ సీఎం రేవంత్ కేసులు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు కేటీఆర్.

You may also like
బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions