Monday 28th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం..సీఎం చంద్రబాబు సీరియస్

ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం..సీఎం చంద్రబాబు సీరియస్

Abhaya Anjaneya Swamy Temple Vandalised In Ap | అన్నమయ్య ( Annamayya ) జిల్లా కదిరినాధుని కోట పంచాయతీ లోని కనుగొండ అటవీ ప్రాంతంలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.

పునాదులతో సహా ఆలయాన్ని పెకిలించే ప్రయత్నం చేశారు. నిత్యం పూజలు జరిగే ఆలయాన్ని ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ క్రమంలో స్థానిక ఆరెస్సెస్ ( RSS ), బీజేపీ ( BJP ) నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై మొలకలుచెరువు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ ( Serious )గా తీసుకుంది. అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu )ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆలయ ధ్వంస సంఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన చెప్పారు. దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ నేరం చేసిన వారిని అరెస్టు చేయాలని ఆదేశించారు.

You may also like
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!
‘లారీతో ఢీ కొట్టి వేట కొడవళ్ళతో..ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య’
‘పహల్గాం ఉగ్రదాడి..NIA చేతికి కీలక ఆధారం’
‘ప్రతీ భారతీయుడి రక్తం మరుగుతోంది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions