BJP Shagun Parihar | తండ్రి మామను అత్యంత కిరాతకంగా టెర్రరిస్టులు హత్య చేసినా ఓ యువ నాయకురాలు వెనుకడుగు వేయలేదు.
ఇటీవల జరిగిన జమ్మూకశ్మీర్ ( Jammu and Kashmir ) అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు అత్యధికంగా ఉండే నియోజకవర్గంలో బీజేపీ ( BJP ) తరఫున గెలిచి షాగున్ పరిహార్ ( Shagun Parihar ) సత్తా చాటారు.
మంగళవారం వెలువడిన ఫలితాల్లో కిష్ట్వార్ ( Kishtwar ) నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన షాగున్ పరిహార్ 521 ఓట్ల తేడాతో ఎన్సీ అభ్యర్థి అయిన సీనియర్ నేత సజ్జద్ అహ్మద్ ను ఓడించారు.
ఆమె తండ్రి అజిత్ పరిహార్ మామ అనిల్ పరిహార్ ను 2018 నవంబర్ 1న పంచాయతీ ఎన్నికల ముందు టెర్రరిస్టులు హత్య చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు వేసే ప్రతీ ఓటు తన కుటుంబానికి చెందాడని టెర్రరిస్టుల దాడుల్లో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి చెందుతాయి అనే నినాదంతో ఆమె ముందుకు వెళ్లారు.
అలాగే జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు మహిళల్లో షాగున్ పరిహార్ కూడా ఒకరు కావడం విశేషం.