Thursday 30th April 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > లైంగిక వేధింపుల కేసు.. టీడీపీ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్!

లైంగిక వేధింపుల కేసు.. టీడీపీ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్!

Koneti Adimulam

TDP MLA Adimulam | లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం (Koneti Adimulam)కు బిగ్ రిలీఫ్ లభించింది. ఏపీ హైకోర్టును ఆ కేసును క్వాష్ చేసింది. కొద్ది రోజుల కిందట తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను బెదిరించి లైంగిక దాడి చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు తాను తిరుపతిలోని హోటల్‌కు పెన్ కెమెరాతో వెళ్లి వీడియోను రికార్డు చేసినట్లు చెప్పుకొచ్చారు.

దీంతో ఆదిమూలంపై తిరుపతి తూర్పు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గత శుక్రవారం జరిగిన విచారణలో బాధిత మహిళ ఈ కేసును కొట్టేయాలని అఫిడవిట్ దాఖలు చేశారు. ఆమె స్వయంగా కోర్టుకు హాజరై ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్ని అవాస్తం అని తెలిపారు.

ఈ మేరకు ఆమె లాయర్‌తో నోటరీ చేసిన అఫిడవిట్‌ను కోర్టులో దాఖలు చేశారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా కేసు నమోదు చేశారని.. మూడో వ్యక్తి ఒత్తిడితో పిటిషనర్‌పై మహిళ ఫిర్యాదు చేసినట్లు ఆదిమూలం తరఫున లాయర్ వాదించారు. హనీట్రాప్‌ జరిగిందని..అత్యాచారం సెక్షన్‌ నమోదు చెల్లదని ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోర్టును కోరారు.

సదరు మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఎమ్మెల్యేపై కేసును కొట్టేయాలని న్యాయమూర్తిని కోరారు.  వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కేసులో ఉత్తర్వులు ఇచ్చేందుకు బుధవారానికి వాయిదా వేశారు. ఇవాళ కేసును క్వాష్ చేస్తూ తీర్పును వెల్లడించారు.

You may also like
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
జగన్ పై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!
ttd
తిరుమల క్యూ లైన్ లో ఫైట్..స్పందించిన టీటీడీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions