Ganesha Idol In Bengaluru Police Van | కర్ణాటక రాష్ట్రంలో ఓ పోలీస్ వ్యాను ( Police Van )లో వినాయక విగ్రహాన్ని తరలించడం తీవ్ర వివాదంగా మారింది.
ఆ రాష్ట్రంలోని నాగమంగలంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణలను నిరసిస్తూ బెంగుళూరులో హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. అయితే దీనికి కోర్టు అనుమతి లేకపోవడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
వారి దగ్గర ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పోలీస్ వ్యాన్ లో పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ వినాయకుడ్ని కూడా అరెస్ట్ చేసిందిని ప్రధాని మోదీ ( Pm Modi ) సైతం విమర్శించారు. ఈ క్రమంలో వ్యాన్ లో వినాయక విగ్రహంపై బెంగుళూరు పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
అనుమతి లేకుండా ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని, అనంతరం వారివద్ద ఉన్న విగ్రహాన్ని వ్యాన్ లో పెట్టినట్లు పోలీసులు చెప్పారు. ఆ తర్వాత సంప్రదాయబద్ధంగానే నిమర్జనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.