Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > సపోర్టింగ్ రోల్ లో మంత్రి శ్రీధర్ బాబుకు భాస్కర్ అవార్డు

సపోర్టింగ్ రోల్ లో మంత్రి శ్రీధర్ బాబుకు భాస్కర్ అవార్డు

ktr

 KTR Nominates Minister Sridhar Babu For Bhaskar Award | మంత్రి శ్రీధర్ బాబుపై సెటైర్లు వేశారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ( Brs Working President ) కేటీఆర్.

కాగా ఇద్దరు బీఆరెస్ ఎమ్మెల్యేలు అయిన అరికపూడి గాంధీ ( Arekapudi Gandhi ), కౌశిక్ రెడ్డి ( Kaushik Reddy ) కొట్లాడుకుంటే ఆ నెపం కాంగ్రెస్ పై వేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు కామెంట్ చేశారు. దింతో ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.

మంత్రి గారు అతితెలివితో హైకోర్టు ను మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ఈ లాజిక్ ( Logic ) ప్రకారం మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీ ( TDP ) లోనే ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా ? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

మరి మా BRS ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరిగి వారికీ కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవడు? అని మండిపడ్డారు. సిగ్గులేకుండా ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు ? అంటూ నిలదీశారు.

అసలు చేర్చుకోవడం ఎందుకు, ఆ తర్వాత పదవులు పోతాయి అన్న భయంతో ఈ నాటకాలు ఎందుకు ? అని ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా బెస్ట్ సపోర్టింగ్ రోల్ కు మంత్రి శ్రీధర్ బాబును భాస్కర్ అవార్డు ( Bhaskar Award )కు నామినేట్ చేస్తున్నట్లు కేటీఆర్ సెటైర్లు వేశారు.

You may also like
ఆ వ్యాఖ్యలు చేశారు..బండి సంజయ్-అరవింద్ లకు కేటీఆర్ నోటీసులు
తారకరామారావు తప్ప మరే ‘రావు’ లేరు!
‘డ్రగ్స్-హీరోయిన్లతో సంబంధాలు అంటూ వ్యక్తిత్వ హననం’
‘అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని ఉరి తీయాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions