Tuesday 29th July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘ జగన్ లాంటి అసమర్థ వ్యక్తి సీఎం ఎలా అయ్యాడు ?’

‘ జగన్ లాంటి అసమర్థ వ్యక్తి సీఎం ఎలా అయ్యాడు ?’

Minister Satya Kumar Yadav News | ఏపీలో మెడికల్ సీట్లు వద్దంటూ కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖను రాసిందని వైసీపీ ( YCP ) విమర్శించింది.

ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ( Satyakumar Yadav ) తీవ్రంగా స్పందించారు. జగన్ లాంటి అసమర్థ వ్యక్తి సీఎం ఎలా అయ్యాడు? అని మంత్రి ప్రశ్నించారు.

‘మోదీ ప్రభుత్వం మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి నాలుగేళ్లు నిండాయి. ఇప్పటికీ పూర్తిగా నిర్మాణం అయ్యింది ఒక్కటి లేదు. సగం పైగా పునాదుల దశలోనే. మెడికల్ కౌన్సిల్ ( Medical Counsil ) జూలై నెలలోనే అనుమతి నిరాకరించిన విషయం మీకుతెలియదా?

అవన్నీ ఎందుకు సొంత నియోజకవర్గం పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదు. 48% బోధనా సిబ్బంది లేరన్న విషయం మరిచారా? అనుమతి తీసుకుని విద్యార్థులను ఎక్కడ చదివించాలి సారూ? చెట్ల కింద? అమ్మాయిలను ఎక్కడ ఉంచాలి సారూ? షెడ్ల కింద? పోనీ సర్దుకుందాం. మరి పాఠాలు ఎవరు చెప్పాలి? మీరు చెప్తారా ప్రొఫెసర్ జగన్? ఇటువంటి అబద్దాలను ప్రచారం చేస్తున్నారనే ప్రజలు మీకు 151 నుండి 11 కు దించారు. అయినా బుద్ధి తెచ్చుకోకపోతే ఎలా? ‘ అని సత్యకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

You may also like
అశోక్ గజపతిరాజుకు సిగరెట్ అంటే సరదా..ఎలా మానేశారంటే!
‘చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాప్’
‘మహిళలకు రూ.1500..అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాలి’
‘మనసుకు చాలా సంతోషంగా ఉంది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions