KTR Comments on Valmiki Scam | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో జరిగిన వాల్మీకి స్కామ్ (Valmiki Scam) లో తెలంగాణ నేతలకు మరియు పలువురు వ్యాపారవేత్తలకు రహస్య సంబంధం ఉందని ఆరోపించారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).
కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్ నుండి రూ.45 కోట్లు బదిలీ అయ్యాయని తెలిపారు. ఈ డబ్బులు హైదరాబాద్ లోని 9 బ్యాంక్ ఖాతాలకు బదిలీ అయ్యాయని ఆరోపణలు చేశారు. పార్లమెంటు ఎన్నికల వేళ నగదు డ్రా చేసిన బార్లు, బంగారు దుకాణాల యజమానులు ఎవరని, వారికీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సంబంధం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ మేరకు వాల్మీకీ స్కామ్ కు సంబంధించి రాష్ట్రంలో ఈడీ, సిట్, సీఐడీ సోదాలు జరిగాయని, కానీ ఈ వార్తలను బయటకు రాకుండా అణిచివేశారని కేటీఆర్ ఆరోపించారు. రూ.90 కోట్ల స్కామ్ జరిగిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటించారని గుర్తుచేశారు.
సిద్దరామయ్యను (CM Siddaramaiah)ను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కులుతుందని ఆ రాష్ట్ర మంత్రి సతీష్ ఎందుకన్నారని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇన్ని విషయాలు బయటకు వచ్చినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంది, రాష్ట్ర కాంగ్రెస్ ను కాపాడుతుంది ఎవరు అని ఆయన ఎక్స్ వేదికగా నిలదీశారు.