Monday 4th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం.. సీఎం మమత నిరసన ర్యాలీ!

ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం.. సీఎం మమత నిరసన ర్యాలీ!

mamata banerjee

CM Mamata Banerjee Rally | కోల్‌కత్తాలో (Kolkata Trainee Doctor) ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళా ఎంపీలు, యువతులతో కలిసి నడుస్తూ బాధితురాలికి న్యాయం జరగాల్సిందేనని నినదించారు.

ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఆర్జీ కర్ హాస్పిటల్‌పై దాడి జరిగిన ఘటనలో హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించిన కాసేపటికే మమతా ర్యాలీ చేశారు. హత్యాచారం జరిగిన ఆర్‌జీ కార్ హాస్పిటల్‌ వద్దే ఈ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కొందరు నిజం బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడ్డారు. హాస్పిటల్‌పై దాడి చేసింది బీజేపీ, వామపక్షాలేనని ఆరోపించారు.

మహిళా ఎంపీలు, యువతులతో కలిసి “ఉరిశిక్ష వేయాల్సిందే” అంటూ పెద్ద ఎత్తున నినదించారు. సీబీఐకి అల్టిమేటం జారీ చేశారు. తక్షణమే విచారణ జరిపించి నిందితుడికి ఉరిశిక్ష విధించేలా చొరవ చూపించాలని డిమాండ్ చేశారు. 

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త.. హైకోర్టు కీలక తీర్పు!
vc sajjanar
పెళ్లి పేరుతో మోసాలు.. అమ్మాయిలూ.. బీ కేర్‌ఫుల్: సీపీ సజ్జనర్!
ys jagan
మీ తండ్రి వారసత్వాన్ని తాకట్టు పెట్టకండి.. వైఎస్ జగన్ కు యూత్ కాంగ్రెస్ కౌంటర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions