Monday 12th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వరుసగా 11వసారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ!

వరుసగా 11వసారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ!

pm modi

PM Narendra Modi | భారత 78 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

అనంతరం ఎర్రకోటకు చేరుకున్న మోదీ.. త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు. తర్వాత సైనికుల నుంచి గౌరవందనం స్వీకరించారు. ఎర్రకోటపై హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు.

వరుసగా 11వ సారి మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తద్వారా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌‌ను ఆయన అధిగమించారు. అయితే, ఇప్పటి వరకూ అత్యధికంగా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 17 సార్లు జెండాను ఎగురవేయగా.. ఆయన తర్వాత ఇందిరాగాంధీ 16 సార్లు రెండో స్థానంలో ఉన్నారు.

You may also like
bankim babu not bankim da
‘బంకిం దా కాదు.. బంకిం బాబు అని చెప్పాలి..’ ప్రధానికి ఎంపీ సూచన!
cm revanth reddy speech
ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.. స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి!
pm modi
ఈ దీపావళికి డబుల్ బొనాంజా.. ఎర్రకోట వేదికగా ప్రధాని కీలక ప్రకటన!
modi hoists national flag
79వ స్వాతంత్య్ర దినోత్సవం.. ప్రధాని మోదీ మరో ఘనత!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions