Wednesday 6th May 2026
12:07:03 PM
Home > తెలంగాణ > శ్రీ బాలాజీ టాక్స్ సర్వీసెస్ అధినేత భాస్కర్ అయితకు రాష్ట్రీయ గౌరవ్ అవార్డు!

శ్రీ బాలాజీ టాక్స్ సర్వీసెస్ అధినేత భాస్కర్ అయితకు రాష్ట్రీయ గౌరవ్ అవార్డు!

bhasker aitha

Rashtriya Gaurav Award For Bhasker Aitha | హైదరాబాద్ లో టాక్స్ కన్సల్టెన్సీ విభాగంలో విశేష సేవలు అందిస్తున్న శ్రీ బాలాజీ టాక్స్ సర్వీసెస్ అధినేత భాస్కర్ అయితకు అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అసాధారణ విజయాలు సాధించిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం రాష్ట్రీయ గౌరవ్ అవార్డు అందుకున్నారు.

టాక్స్ కన్సల్టెన్సీలో దాదాపు 1000 మందికి పైగా క్లయింట్లకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగాను భాస్కర్ ఈ అవార్డు గెలుచుకున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ లక్డీకాపుల్ లోని ఎఫ్టీసీసీఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భాస్కర్ అయిత కు నిర్వాహకులు ఈ అవార్డు అందజేశారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి చేతుల మీదుగా భాస్కర్ ఈ రాష్ట్రీయ గౌరవ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు రావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీ బాలాజీ టాక్స్ సర్వీసెస్ ద్వారా టాక్స్, ఐటీ ఫైలింగ్ తదితర విభాగాల్లో 1000 మందికి పైగా క్లయింట్లకు సేవలు అందిస్తున్నామని తెలిపారు.

You may also like
SBTS Co Founder: లక్ష్మి అయితకు వందేభారత్ భీష్మ వశిష్ట పురస్కార్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions