Friday 2nd May 2025
12:07:03 PM
Home > తాజా > “నియంత పాలనను నిలువునా పాతిపెడుతూ..” షర్మిల ఆసక్తికర పోస్ట్!

“నియంత పాలనను నిలువునా పాతిపెడుతూ..” షర్మిల ఆసక్తికర పోస్ట్!

sharmila

Sharmila Tweet On New Government | తెలంగాణలో కొలువైన కొత్త ప్రభుత్వానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

“పదేండ్ల నియంత పాలనను నిలువునా పాతిపెడుతూ, కాంగ్రెస్ మీద నమ్మకంతో, సరికొత్త ఆశలతో పట్టంకడుతూ తెలంగాణ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఒక అద్భుతం. ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం మరొక్క మహత్తర ఘట్టం. ఇది సుపరిపాలనకు నాంది అని కూడా మేము ఆశిస్తున్నాం.

ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా, నిబద్ధత, నిస్పాక్షికతకు మారుపేరుగా ఈ సర్కారు ఉండబోతోంది. ఇది నూటికి నూరుశాతం నాలుగు కోట్ల ప్రజల నమ్మకం. YSR తెలంగాణ పార్టీ తరపున కాంగ్రెస్ సర్కారుకు ఎల్లవేళలా సహకారం, మద్దతు, మనస్ఫూర్తిగా అందించడానికి మేం సిద్దమే అని సంతోషంగా తెలియజేస్తున్నాం.

ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు టీం కాంగ్రెస్ నాయకులకు మా శుభాకాంక్షలు. అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు షర్మిల.

 

You may also like
‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా టీ-షర్ట్..అల్లు అర్జున్ వీడియో వైరల్’
‘ఉగ్రవాదులతో పాక్ బంధం..నిజం ఒప్పేసుకుంటున్న ఆ దేశ నేతలు’
సన్యాసాశ్రమంలో మోదీ పేరేంటో తెలుసా..బయటపెట్టిన పవన్!
‘విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేయండి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions