KCR loses In Kamareddy | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఓటమి పాలయ్యారు. కామారెడ్డిలో కేసీఆర్ అనూహ్య ఓటమి చెందారు.
మొదటి నుంచి బీఆరెస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య సాగిన పోరులో చివరికి కాషాయ పార్టీ విజయం సాధించారు.
కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన సమీప ప్రత్యర్థి, సీఎం కేసీఆర్ పై 6 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఇక కొడంగల్ లో భారీ మెజారిటీతో గెలుపొందిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో మూడోస్థానానికి పరిమితం అయ్యారు.
అయితే గజ్వేల్ విజయం సాధించిన కేసీఆర్, కామారెడ్డిలో మాత్రం ఏ దశలోనూ మొదటి స్థానంలోకి రాలేదు.








