Thursday 26th December 2024
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ కు ఒక గిఫ్ట్ ఇస్తున్నాం.. వైఎస్ షర్మిల సెటైర్లు!

కేసీఆర్ కు ఒక గిఫ్ట్ ఇస్తున్నాం.. వైఎస్ షర్మిల సెటైర్లు!

sharmila

Sharmila Satires On KCR | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందనే అంచనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేసీఆర్ పై సెటైర్లు వేశారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

కేసీఆర్ సూట్ కేసు పట్టుకుని సర్ధుకునే టైం వచ్చింది.. బైబై కేసీఆర్.. అని వ్యాఖ్యానించారు.

శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. “కేసీఆర్ పాలనకు ఎండ్ కాడ్ పడబోతుంది. కేసీఆర్ ప్యాక్ అప్ చేసుకునే టైం వచ్చింది.

కేసీఆర్ కు ఒక గిఫ్ట్ ఇస్తున్నాం. 2018, 2023 ఎన్నికల్లో కేవలం పదివేల తేడాతో గెలిచిన ఎమ్మెల్యేలు 33 మంది మాత్రమే.

కర్నాటక ఎన్నికల్లో 71 మంది పదివేల మెజార్టీతో గెలిచారు. పదివేల మెజార్టీ అయినా కూడా ముఖ్యం కాబట్టి. మేము పోటీ చేసి ఒకవేల 5,000 ఓట్లు చీల్చినా తేడా వస్తుంది. కేసీఆర్ ను ఓడించాలని కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాం.

ఇన్నాళ్లు బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నారని తెలంగాణ ప్రజలకు అర్థం అయ్యింది. కేసీఆర్ అవినీతి మీద బీజేపీ ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు.

వీళ్లిద్దరు తోడుదొంగలు అయి కలిసే ఉన్నారని ఆరోపిస్తున్నాం. కేసీఆర్ కు మించిన కరెప్టెడ్ పొలిటీషియన్ లేరని అమిత్ షా చెప్పారు.

ఆయన ఏ స్కీం లు చేసినా అవినీతే అని మోదీ చెప్పారు. మీరు మీరు కలిసి లేకపోతే మేం ఎంక్వేరీ వేయాలని కోరినా ఒక్క యాక్షన్ కూడా ఎందుకు తీసుకోలేదు…?

బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటి కాకపోతే ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వకుండా ఉండాలి. దీన్ని రిఫరాండంగా తీసుకోవాలి తప్ప ఎమ్మెల్యేలను కొనుగోలు చేయొద్దు. 2014, 2018లో 45 మందిని కేసీఆర్ కొన్నాడు.

ఇది మళ్లీ రిపీట్ కాకూడదు. బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి అధికారంలోకి వచ్చే విధంగా చేయకోడదని కేసీఆర్ ను మేము డిమాండ్ చేస్తున్నాం.

కాంగ్రెస్ పార్టీలో క్రెడిబిలిటీ ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం మారాలి. ఎవరు ముఖ్యమంత్రికావాలన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది.” అని పేర్కొన్నారు షర్మిల.   

You may also like
సోఫా చేరాల్సిందే..సీఎంతో ఇండస్ట్రీ భేటీపై అంబటి రాంబాబు
 బాక్సింగ్ డే టెస్టు..విరాట్-కాన్‌స్టాస్ మధ్య వాగ్వాదం
tollywood meets cm revanth
సీఎం రేవంత్ తో సినీ పెద్దల భేటి.. ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవే?
ktr
ఏడో గ్యారెంటీని అమలు చేస్తున్నారు..సీఎం పై కేటీఆర్ ఆగ్రహం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions