Nampally Incident | హైదరాబాద్ లోని నాంపల్లి బాజర్ ఘాట్ లో ఘోర అగ్నిప్రమాదం (Nampally Fire Accident) సంభవించిన విషయం తెల్సిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 9 మంది మరణించారు.
ఇదిలా ఉండగా అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న నాంపల్లి కాంగ్రెస్ (Congress) అభ్యర్ధి ఫిరోజ్ ఖాన్ (Feroz Khan) ఘటనస్థలానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఘటన స్థలాన్ని పరిశీలించి తిరిగి వెళ్తున్న ఫిరోజ్ ఖాన్ ను అడ్డుకున్నారు ఎంఐఎం (AIMIM) కార్యకర్తలు. దింతో కాంగ్రెస్ మరియు ఎంఐఎం కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అలాగే ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహిగా ఆందోళనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
మరోవైపు ఘటన స్థలాన్ని పరిశీలించారు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు కేటీఆర్(KTR). మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు కేటీఆర్.