Friday 2nd May 2025
12:07:03 PM
Home > తాజా > ప్రభుత్వం కూలిపోతుంది.. బండి సంజయ్ హాట్ కామెంట్స్!

ప్రభుత్వం కూలిపోతుంది.. బండి సంజయ్ హాట్ కామెంట్స్!

Bandi Sanjay Kumar

Bandi Sanjay | తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు.

చొప్పదండి నియోజవర్గ బీజేపీ అభ్యర్థి బోడిగ శోభ (Bodige Shobha) తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ రాష్ట్రంలో బీజేపీ (BJP)ని దెబ్బతీసి కాంగ్రెస్ గ్రాఫ్‌ను పెంచే కుట్రకు కేసీఆర్ తెరతీశారని ఆరోపించారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వస్తే కొద్ది నెలల్లోనే ప్రభుత్వం కుప్పకూలి మళ్లీ ఎన్నికలు రావడం తథ్యం అని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. కేటీఆర్ (KTR) సీఎం అవుతారు. దీంతో హరీష్ రావు, కవిత, సంతోష్ రావు బయటకు వస్తారు.

Read Also: స్టేషన్ ఘనపూర్ లో సర్పంచ్ నవ్య నామినేషన్!

కేటీఆర్ అహంకారాన్ని భరించలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలెవరూ ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. అప్పుడు ప్రభుత్వం కూలిపోతుంది.

అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం పదవి కోసం అందరూ కొట్లాడుకుంటరు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, కోమటిరెడ్డి సహా ప్రతి ఒక్కరూ మాకే సీఎం కావాలని గోల పెడతరు.

ఈ సీఎం కుర్చీ కొట్లాటలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. అప్పుడు ఎన్నికలు తథ్యం. తెలంగాణలో సుస్థిర పాలన కావాలంటే అది బీజేపీకే సాధ్యం అని వ్యాఖ్యానించారు బండి సంజయ్.

Also Read: “మీది ఫెయిల్యూర్.. మాది పవర్ ఫుల్” సిద్దరామయ్యకు కేటీఆర్ కౌంటర్!

బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని చెప్పనన్నారు బండి సంజయ్.  అది తనకు అలవాటు లేదన్నారు.   ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలనేది ఎన్నికైన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారనీ చెప్పారు.

ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు బీజేపీ అధిష్టానం సీఎం అభ్యర్ధిని ప్రకటిస్తుందని తెలిపారు.

సామాన్య కార్యకర్తనైన తనను బీజేపీ ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసింది పార్టీయేనన్నారు.

బీజేపీ నిర్ణయమే తనకు శిరోధార్యమని చెప్పారు. అయితే బీజేపీ గెలిస్తే బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని తెలిపారు’ బండి సంజయ్.

You may also like
‘కొత్త పార్టీ ప్రచారంపై హరీష్ రావు రియాక్షన్’
cm revanth reddy
ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!
cm revanth reddy
కేసీఆర్ ప్రసంగంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions