Thursday 21st November 2024
12:07:03 PM
Home > తెలంగాణ >  మీ చేతగానితనాన్ని బీజేపీపై నెడతారా: బీజేపీ నేత కే. లక్ష్మణ్

 మీ చేతగానితనాన్ని బీజేపీపై నెడతారా: బీజేపీ నేత కే. లక్ష్మణ్

BJP Leader K Lakshman | గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే రాష్ట్రంలో CM ఉన్నడా? అసలు పాలన ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే. లక్ష్మణ్.

ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అయ్యిందనీ.. తాజాగా టెన్త్ క్లాస్ పశ్నపత్రాలు కూడా లీక్ అవడంతో రాష్ట్రంలో అసలేం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు.

పేపర్ లీకేజీల వ్యవహారంపై ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

“కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తొందని ఆరోపించారు. పరీక్షలంటే లెక్కలేని తనం కన్పిస్తోందని విమర్శించారు.

గతేడాది ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనంలో తప్పిదాలతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నరు. రెండేళ్ల క్రితం టెన్త్ పేపర్ లీకైంది.

జవాబు పత్రాల బండిళ్లు రోడ్లపై ప్రత్యక్షమవుతున్నా పట్టించుకోని దుస్ధితి. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత?

Read Also: గ్యాంగ్రిన్ పై అవగాహన అవసరం: ఈటల రాజేందర్

పరీక్షల నిర్వహణలో బాధ్యత వహించాల్సిన బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన తప్పిదాలను బీజేపీపై నెట్టే కుట్రకు పాల్పడటం సిగ్గు చేటు. బీఆర్ఎస్ చేతగానితనాన్ని బీజేపీ రుద్దితే ఎట్లా?

తండ్రి, కొడుకులకు   ‘‘నెయ్యి’’ మీద ఉన్న శ్రద్ధ పాలనపై లేదు. ‘‘నెయ్యి’’ అంటే తెలుసు గదా నిన్న తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చెబితే తెలిసింది.

డ్రగ్స్, పత్తాలు, భూములు, దొంగ సారా దందాతో సంపాదించిన డబ్బులు చాలడం లేదని బీఆర్ఎస్ నేతలు పేపర్ లీకేజీమీద పడ్డరు.

కార్పొరేట్ శక్తులకు అమ్ముకుని కోట్లు సంపాదిస్తూ ప్రభుత్వ, చిన్న పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నరు.

ప్రశ్నా పత్రాలంటే బీఆర్ఎస్ నేతలకు నోట్ల కట్టలుగా మారినయ్. విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్ కేసీఆర్ కుటుంబానికి వ్యాపారంగా మారింది. జవాబు పత్రాలంటే వాళ్లకు మిఠాయి పొట్లాలతో సమానమైంది. రేపటి భావి భారత పౌరుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

మంత్రులు రబ్బర్ స్టాంపుల్లా మారారు. వాళ్లకు అసలు వాళ్ల శాఖల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అన్నీ శాఖల అధికారులను సీఎం కుటుంబం తమ గుప్పిట్లో పెట్టుకుని మంత్రులను రబ్బర్ స్టాంపుల్లా మార్చింది.

కేసీఆర్ ప్రభుత్వం తన చేతగానితనాన్ని బీజేపీపై నెట్టే కుట్రకు దిగజారడం నీచరాజకీయాలకు పరాకాష్ట.  తక్షణమే టీఎస్పీఎస్పీ, టెన్త్ పేపర్ లీకేజీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలి.

బాధ్యులైన మంత్రులను కేబినెట్ నుండి తొలగించాలి. టీఎస్పీఎస్పీ, టెన్త్  పేపర్ల లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలి. దోషులు కఠినంగా శిక్షించాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం” అని ప్రకటనలో పేర్కొన్నారు లక్ష్మణ్.

You may also like
BJP Raghunandan rao
బండి సంజయ్ గెలిస్తే మోదీ కేబినెట్ లో మంత్రి కావడం తథ్యం!
BRS Cong Flags
రాష్ట్రంలో కాంగ్రెస్.. రాజధానిలో బీఆరెస్.. అనూహ్య ఫలితాలు!
బీజేపీకి తుల ఉమ రాజీనామా.. బీఆరెస్ లో చేరిక?
Bandi Sanjay Kumar
ప్రభుత్వం కూలిపోతుంది.. బండి సంజయ్ హాట్ కామెంట్స్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions