Sunday 27th July 2025
12:07:03 PM
Home > తెలంగాణ > గ్యాంగ్రిన్ పై అవగాహన అవసరం: ఈటల రాజేందర్

గ్యాంగ్రిన్ పై అవగాహన అవసరం: ఈటల రాజేందర్

  • కేబీకే హాస్పిటల్ “సేవ్ ఆర్గాన్స్.. సేవ్ లైఫ్” పోస్టర్ ఆవిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యే

Eatala Rajender Unveils Save Organs Poster | ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల ఆంప్యుటేషన్స్ కి కారణమవుతున్న గ్యాంగ్రిన్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.

మంగళవారం తన నివాసంలో కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేపట్టిన సేవ్ ఆర్గాన్స్.. సేవ్ లైఫ్ క్యాంపెయిన్ కు సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించారు.

Read Also: KBK Group Managing Director జయ వైష్ణవికి నారీ పురస్కార్ అవార్డు!

ఈ సందర్భంగా షుగర్ సంబంధిత వ్యాధులైన గ్యాంగ్రిన్, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, సెల్యూలైటిస్ తో పాటు అగ్ని ప్రమాదాలు, దీర్ఘకాలిక చర్మపు పూతల కారణంగా కొన్ని వేల మంది తమ కాళ్లు చేతులు పోగొట్టుకుంటున్నారని తెలిపారు.

ఇలాంటి వ్యాధులకు ఆంప్యుటేషన్ చేయాల్సిన అవసరం లేకుండా కేబీకే హాస్పిటల్ లో పూర్తిగా నయం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

ఇలాంటి అత్యాధునిక చికిత్సపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అందుకోసం సేవ్ ఆర్గాన్స్ క్యాంపెయిన్ తోపాటు, ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించడాన్ని ఎమ్మెల్యే ఈటల కొనియాడారు.

Read Also: Save Organs Save Life: KBK Hospital ఆధ్వర్యంలో నెల రోజులు ఉచిత హెల్త్ క్యాంప్!

అదే విధంగా షుగర్ తో బాధపడే వారు తమ ఆరోగ్య సంరక్షణ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో కేబీకే హాస్పిటల్ ప్రతినిధులు దేవులపల్లి శివ కృష్ణ, దేవులపల్లి సత్యసాయి, విశాఖ రాజేందర్ రెడ్డి, సావిరెడ్డి సందీప్ రెడ్డి, చప్పిడి శ్రీకాంత్ రెడ్డి, ముద్దగోని శంకర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like
కేబీకే గ్రూప్ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
kbk group
కేబీకే గ్రూప్ ఖాతాలో మరో అవార్డు!
Kakkireni Bharath Kumar
KBK Group Chairman భరత్ కుమార్ కక్కిరేణికి విజనరీ లీడర్ అవార్డ్!
eatala rajendar
లగచర్ల ఘటన స్కెచ్ కాంగ్రెస్ నాయకులదే: ఈటల రాజేందర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions