Friday 22nd November 2024
12:07:03 PM
Home > తెలంగాణ > పేపర్ లీకేజీ బాధ్యుడు ఆయనే.. బర్తరఫ్ చేసే దమ్ముందా కేసీఆర్: బండి సంజయ్

పేపర్ లీకేజీ బాధ్యుడు ఆయనే.. బర్తరఫ్ చేసే దమ్ముందా కేసీఆర్: బండి సంజయ్

Bandi Sanjay Kumar | టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీ బాధ్యుడు మంత్రి కేటీఆరేనని వ్యాఖ్యానించారు.

“టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతంతా ఐటీ శాఖదే… మరి ఆయనను బర్త్ రఫ్ చేస్తారా? లోపలేసి తొక్కే దమ్మ  కేసీఆర్ కు ఉందా?

తప్పు ఎవరు చేసినా… చివరకు నా కొడుకు, బిడ్డనైనా ఊరుకునేది లేదని అసెంబ్లీ లో చెప్పిన మాటలకు కేసీఆర్ కట్టుబడి కొడుకును కేబినెట్ నుండి బర్త్ రఫ్ చేస్తారా?’’అంటూ Bandi Sanjay ప్రశ్నించారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై జరిగిన పోరాటంలో అరెస్టై చంచల్ గూడ జైల్లో ఉంటున్న బీజేవైఎం (BJYM) నాయకులను గురువారం బండి సంజయ్ పరామర్శించారు.

అనంతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి. ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎస్సీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు ఎస్. కుమార్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.

“టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో తెలంగాణలోని లక్షలాది యువత తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలు పేపర్ లీకేజీ ఎట్లా అయ్యంది? టీఎస్పీఎస్సీ ఛైర్మన్ కు తెలియకుండా ఎట్లా లీకైంది?

ముందు వాళ్లను ప్రాసిక్యూట్ చేయాలి. నేరస్తులను కాపాడుకునేందుకే సిట్ వేశారు.

మియాపూర్ భూములు, డ్రగ్స్, నయీం కేసులపై వేసిన సిట్ లు ఏమయ్యాయి? కేసీఆర్ (KCR) సిట్ అంటే సిట్…. స్టాండ్ అంటే స్టాండే.

కేసీఆర్ ఫ్యామిలీ తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి అభ్యంతరమేంది? ఇదంతా కేసీఆర్ కొడుకు ఆడుతున్న డ్రామా?  ‌

ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ కొడుకు పాత్ర క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఐటీశాఖ ఫెయిల్యూర్ ఉంది. అయినా కేసీఆర్ ఏమీ మాట్లాడటం లేదు. కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే కొత్త డ్రామా చేస్తున్నడు.

బీజేపీ పాత్ర ఉందని సిగ్గు లేకుండా ఆరోపిస్తున్నారు. రాజశేఖర్ అనే వ్యక్తి బీజేపీ నాయకుడని అంటున్నారు. 2017 నుండి అతను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఉద్యోగి.

ఐటీశాఖ పరిధిలో ఉంటుంది. మరి ఇన్నాళ్లు ఏం చేస్తున్నట్లు? అట్లాంటివాళ్లను గుర్తించడం చేతగాని నువ్వు మంత్రిగా ఉండటానికే అనర్హులు.

నాతో రోజూ వెయ్యి మంది వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు. వాళ్లందరితో నాకు సంబంధం ఉన్నట్లా? మీకు బయటకు రావడం చేతగాదు. ప్రజలను కలవడం చేతగాదు. మీదంతా దొంగ సారా, పత్తాల దందా.

రేణుక అమ్మ బీఆర్ఎస్ సర్పంచ్.. వాళ్ల అన్న బీఆర్ఎస్ నాయకుడు. ఆ కుటుంబం అంతా బీఆర్ఎస్సే… మరి పేపర్ లీకేజీ ఎవరి కోసం అయ్యింది? బీజేపీపై మొరిగే కుక్కలంతా ఏం సమాధానం చెబుతారు?

బీజేపీ లీక్ చేశారని చెబుతున్న వాళ్లంతా ఎందుకు ఆధారాలు చూపడం లేదు? రేణుకకు గురుకులం స్కూళ్లో ఉద్యోగం ఇచ్చారు? ఆమె కోసమే పేపర్ లీక్ చేసిన విషయం బహిర్గతమైంది?

పరీక్షలు కూడా నిర్వహించలేని చేతగానితనం కేసీఆర్ సర్కార్ ది. కనీసం టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించడం చేతగావడం లేదు. దొంగ నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.

ఐటీ శాఖ కేసీఆర్ కొడుకు వద్దే ఉంది. దీనికి బాధ్యుడు ఆయనే. మరి ఆయనను బర్త్ రఫ్ చేస్తారా? ఆయనను లోపలేసి తొక్కుతారా?

తప్పు ఎవరు చేసినా… చివరకు నా కొడుకు, బిడ్డనైనా ఊరుకునేది లేదని అసెంబ్లీ లో కేసీఆర్ చెప్పారు కదా… మరి ఇప్పుడేం చేస్తావ్? నీ కొడుకు రాజీనామా చేయాల్సిందే.. చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

తక్షణమే జరిగిన పరిణామాలకు బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలి. ఛైర్మన్ ను తొలగించాలి. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలి.

నిరుద్యోగులంతా మీ నిర్వాకంవల్ల ఆందోళన పడుతున్నరు. ఉస్మానియాలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. భేషరతుగా వారిని విడుదల చేయాలి. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు.” అని బండి సంజయ్ హెచ్చరించారు.

You may also like
cm revanth visits vemulawada
వేములవాడలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు!
School Bus Tractor Collission
స్కూల్ బస్ బోల్తా..చిన్నారులకు గాయాలు!
eatala rajendar
లగచర్ల ఘటన స్కెచ్ కాంగ్రెస్ నాయకులదే: ఈటల రాజేందర్!
పట్నం నరేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions